Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani Casino Effect: ‘క్యాసినో’ ఎఫెక్ట్: కొడాలి నాని వైసీపీలో ఒంటరి అయ్యారా?

Kodali Nani Casino Effect: ‘క్యాసినో’ ఎఫెక్ట్: కొడాలి నాని వైసీపీలో ఒంటరి అయ్యారా?

Kodali Nani Casino Effect: ఆయన మాట్లాడితే టీడీపీ నేతలకు కాళ్ల నుంచి రోషం పుట్టుకొస్తుంది.. ఆయన వాదిస్తే సొంత పార్టీలోని నాయకులు కూడా ఒక్కోసారి కామ్ గా ఉండాల్సిన పరిస్థితి.. సీఎం జగన్  మెచ్చుకున్న మంత్రుల్లో ఆయన ఒకరు.. ఆయనే కొడాలి శ్రీ వెంకటేశ్వర్ రావు.. అలియాస్ కొడాలి నాని.. ఏపీ సీఎం జగన్ తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు పొందారు మంత్రి కొడాలి నాని. తనదైన పరుష వ్యాఖ్యలతో.. సూటి పోటి విమర్శలతో ప్రతిపక్ష నాయకులకు దడలు పుట్టించే మంత్రికి ఇప్పుడు సొంత పార్టీ నుంచే మద్దతు లభించడం లేదా..? జగన్ అంటే వీరాభిమానం ఉన్న ఆయనకు ఇప్పుడు అన్న సపోర్టు కూడా ఉండడం లేదా..? పార్టీకి చెందిన కొందరు నాయకులు బహిరంగంగానే కొడాలి నానిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.. ఒకప్పుడు కొడాలి నాని బూతులు తిట్టినా చప్పట్లు కొట్టేవాళ్లు.. ఇప్పడు ఆయన నీతి వ్యాఖ్యాలు చెప్పినా ఎందుకు మెచ్చుకోవడం లేదు..? ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి..?

విషయం ఏదైనా నేరుగా బెరుకు లేకుండా మాట్లాడే ఒకే ఒక మంత్రి కొడాలి నాని. అప్పుడప్పుడు తన వ్యాఖ్యల్లో కాస్త మసాలా జొప్పిస్తూ.. సాధారణ వ్యక్తులకు సైతం అర్థమయ్యేలా మాట్లాడే కొడాలి నానికి సొంత పార్టీ నుంచే అసంతృప్తి ఎదురవుతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయనపై క్యాసినో నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి స్థాయిలో ఉండి కొడాలి నాని క్యానినోను నిర్వహించారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. అయితే వెంటనే స్పందించిన మంత్రి తాను క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని ఓ ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు వైసీపీలో నాయకులంతా కొడాలి నాని వైపే మొగ్గు చూపారు.

కానీ రాను రాను టీడీపీ నాయకులు మంత్రికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటపెడుతుండడంతో పాటు మంత్రి నిజంగానే నిర్వహించారా..? అన్న సందేహాలు వారిలో వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా టీడీపీకి చెందిన దూళ్లిపాళ సైతం తాను మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించలేదని నిరూపించకపోతే తానే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో వైసీపీ నేతల్లో అయోమయం నెలకొంది. మరోవైపు మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో కొంచెం ఘాటు వ్యాఖ్యలతో దూకుడు ప్రదర్శిస్తుండడం కొందరి నాయకులకు నచ్చడం లేదు.

ఒంగోలు నుంచి వైసీపీకి చెందిన ఓ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి కొడాలి నాని పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా వారం రోజుల్లో అతనిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే తామే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీంతో పార్టీనాయకుల్లో మంత్రి కొడాలి నానికి మద్దతు ఇచ్చే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు కొడాలి నాని క్యాసినో విషయంలో ఏ ఒక్క మంత్రి మద్దతుగా మాట్లాడడం లేదు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం ఆయన గురించి మాట్లాడారు. అంతేగానీ మిగతా మంత్రులు కొడాలి నానిపై వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక సీఎం జగన్ సైతం కొడాలి నాని క్యాసినో వ్యవహారంలో కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అందుకే ఏ ఒక్క మంత్రి కొడాలి నానికి సపోర్టుగా మాట్లాడకపోయినా పట్టించుకోకపోవడమే అందుకు కారణం అని తెలుస్తోంది. ఇక కొద్ది రోజులుగా నాని వ్యక్తిగతంగానే ప్రెస్ మీట్లు పెడుతూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలో చర్చించకుండా ఇతర నేతలను సంప్రదించకుడా ప్రతిపక్షాలకు విమర్శించడంపై పార్టీలోనే కొందరు నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే మంత్రి క్యాసినో వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Sakhi Movie Trailer: ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. నగేష్ కుకునూరు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను’ అంటూ జగపతిబాబు డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ అదిరిపోయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ జర్నీని చాలా బాగా చూపించారు. ట్రైలర్ లో ఎమోషన్ కూడా బాగా హైలైట్ అయింది. […]

  2. […] Pakistan-China: చైనా, పాకిస్తాన్‌ల బంధం చూసి కొందరు వీరిని ఐరన్ బ్రదర్స్ అని పిలుస్తున్నారు. కాగా, వీరు ఇలా ఫ్రెండ్స్ కావడానికి ఇండియానే కారణం. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సూత్రం ప్రకారం చైనా, పాకిస్తాన్ ల ఉమ్మడి శత్రువు ఇండియా. కాగా, అలా వీరిరువురు భారత దేశానికి వ్యతిరేకంగా కార్యచరణ అమలుకు పూనుకున్నారు. అలా ఇండియాను ఇబ్బంది పెట్టేందుకుగాను ఇరు దేశాలు ప్లాన్ చేసుకున్నాయి. కాగా, ప్రస్తుతం పాకిస్తాన్, చైనా దేశాల మధ్య కూడా చెడింది. ఎందుకంటే.. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular