Bigg Boss 6 Telugu Day 39 Promo: బిగ్ బాస్ లో నిజంగానే తన్నుకు చచ్చారు. హోస్ట్ నాగార్జున ఓవైపు కంటెస్టెంట్స్ గేమ్ ఆడడం లేదని హెచ్చరికలు.. గేమ్ ఆడని వారంతా ఒక్కో వారం ఎలిమినేట్ అవుతున్న తీరు చూసి హౌస్ మేట్స్ అంతా ఎగబడ్డారు. ఫలితంగా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో ఈ వారం తన్నుకుచచ్చారు. బాల్స్ కోసం ఎగబడి.. కొట్టుకొని లాగేసుకొని రచ్చ రచ్చ చేశారు.

బిగ్ బాస్ ఈ వారం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానంటూ న్యాయం చేస్తానంటూ టాస్క్ ఇచ్చి మరీ ‘తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి’ అన్న తరహాలో పోటీపెట్టారు. మధ్యలో బాల్స్ పెట్టేసి.. హౌస్ మేట్స్ పేరుతో బుట్టలు ఏర్పాటు చేసి ఆ బాల్స్ తీసుకొని ఎవరైతే బుట్టులో వేస్తారో వారే కెప్టెన్సీ పోటీదారులు అని టాస్క్ ఇచ్చారు.
దీంతో ఆ బాల్స్ కోసం ఇంటి సభ్యులంతా ఎగబడ్డారు. దాదాపు తన్నుకు చచ్చారే అని చెప్పొచ్చు. బలం లేక.. బాల్స్ అందుకోలే లేడీ కంటెస్టెంట్స్ అయిన మెరీనా, వాసంతి సహా కొందరు ఏడ్చేశారు. సమాన అవకాశాలు అని చెప్పిన బిగ్ బాస్ ఇలా బలంగా ఉండే మేల్ కంటెస్టెంట్స్ తో అమ్మాయిలకు పోటీ పెట్టడం ఏంటని ప్రేక్షకులు నిలదీస్తున్నారు. ఇదేనా సమాన అవకాశాల పోటీ అంటూ తిట్టిపోస్తున్నారు.

ఇక అమ్మ ను చూడాలని.. మాట్లాడాలని ఆశపడిన ఆర్జే సూర్యకు చార్జింగ్ లేదంటూ మాట్లాడనీయకుండా బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. దీంతో అతడు ఏడుపు ఒకటే తక్కువ. ఏడుస్తున్న అతడికి ఊరటనిస్తూ ఒక లేఖను ఆయన అమ్మ నుంచి పంపించి కాసింత కూల్ చేశాడు.
మొత్తంగా ఈ వారం కెప్టెన్సీ టాస్కు పేరుతో ఆడ మగ ఇంటి సభ్యుల మధ్య బిగ్ బాస్ ఒక సిల్లీ అర్థం లేని టాస్క్ పెట్టి తన్నుకుచచ్చేలా చేశాడనడంలో సందేహం లేదు. ఇలాంటి గేమ్ లలో బాయ్స్ గెలుస్తారు. లేడీస్ ఓడిపోతారు.. చివరకు అదే జరిగింది.. లేడీస్ ఏడుపు బిగ్ బాస్ హౌస్ లో ప్రతిధ్వనించింది.
