IND vs NZ : న్యూజిలాండ్ బౌలర్ల ఉచకోత.. కోహ్లీ ఉన్నంత కాలం ఇండియన్ టీమ్ ని టచ్ చేసే టీమ్ లేదు

ఇక ఇదే విధంగా ఇండియా ముందుకు దుసూపోతే ఈ సారి ఇండియా పక్కగా కప్ కొడుతుంది...

Written By: Gopi, Updated On : October 22, 2023 11:09 pm
Follow us on

IND vs NZ : ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా తన జైత్రయాత్రని కొనసాగిస్తుంది. ఇప్పటికే వరుసగా 5 విజయాలను సాధించి ఇండియన్ టీం వరల్డ్ కప్ లో తనదైన మార్కును సృష్టిస్తూ ఈసారి వరల్డ్ కప్పు కొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.

అందులో భాగంగానే ఇప్పటికే వరుస విజయాలను అందుకుంటున్న న్యూజిలాండ్ టీమ్ ని చిత్తు చేసింది.ఇక ఈ క్రమం లో పాయింట్స్ టేబుల్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న ఇండియా టీం తన పొజిషన్ పదిలంగా ఉంచుకుంది. దీంతో ఇండియన్ టీం వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇండియన్ టీం సెమిస్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనే చెప్పాలి. మన టీమ్ విజయంలో మొదటి నుంచి కీలకపాత్ర వహిస్తూ వస్తున్న ప్లేయర్లలో రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లాంటి వాళ్లు ఉన్నప్పటికీ ఎక్కువ ఇండియన్ టీం బాధ్యతలు మోస్తుంది మాత్రం కోహ్లీ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ టోర్నీలో ఆయన అద్భుతమైన మ్యాచులు ఆడుతూ ఇప్పటికే ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీ లు చేసి తనదైన ఇన్నింగ్స్ ని ఆడుతూ ఐదు మ్యాచ్ ల్లో 354 పరుగులు చేశాడు. కోహ్లీ ఉన్నంత సేపు ఇండియన్ టీమ్ ని టచ్ చేసే టీమ్ లేదని ప్రపంచ దేశాలకు సైతం ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది.

ఇక ఈ క్రమంలో ఇండియా అంటే కోహ్లీ , కోహ్లీ అంటే ఇండియా అనేలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్ లో తన 49వ సంచరి చేస్తాడని ఊహించిన అభిమానులకి నిరాశను మిగిల్చిన కోహ్లీ.. ఈ టోర్నీ లో ఇంకా నెక్స్ట్ జరగబోయే మ్యాచ్ ల్లో ఇంకా దాదాపు రెండు, మూడు సెంచరీలను ఈజీగా సాధించి ఈ టోర్నీ లో అతనే హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచే అవకాశం అయితే ఉంది.ఇక ప్రతి మ్యాచ్ లో కూడా తనదైన ఎఫర్ట్ పెట్టీ ఇండియన్ టీమ్ ని విజయతీరాలకు చేర్చడానికి తన వంతు సహాయం చేస్తూ ఒక రకంగా మ్యాచ్ ని తన భుజాల పైన మూసుకొని వెళుతున్నాడు.

ముఖ్యంగా ఇండియా ఒక మ్యాచ్ ని చేదిస్తుంది అంటే అది కోహ్లీ ఉంటేనే ఈజీ గా సాగిపోతుంది లేకపోతే మాత్రం చాలా ఇబ్బందుల్లో పడుతుంది అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీగా మారిపోయింది.ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇండియన్ టీం అహర్నిశలు పోరాడుతూ ఒంటరి పోరాటం చేస్తూ ఇండియన్ టీం కి తనదైన విజయాలను అందిస్తున్నాడు… ఎంత ప్రేజర్ ఉంటే ఆయన అంత బాగా ఆడుతాడు…ఇక ఇదే విధంగా ఇండియా ముందుకు దుసూపోతే ఈ సారి ఇండియా పక్కగా కప్ కొడుతుంది…