Drinking alcohol : ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతీ వ్యక్తికి ఏదో ఒక సమస్య.. ఆఫీసుల్లో వర్క్ ఫ్రెజర్.. వ్యాపారంలో బిజినెస్ స్ట్రెస్.. అయితే ఈ బాధల నుంచి రిలాక్స్ కావడానికి వ్యక్తులు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొందరు సినిమాలు చూసి కాలక్షేపం చేస్తే.. మరికొందరు ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు… ఇంకొందరు స్నేహితులను, కుటుంబ సభ్యులతో ఉంటూ మానసిక ఆనందం పొందుతారు. వీరి కేటగిరికి చెందని వారు మద్యపానం చేసించి రిలాక్స్ అవుతారు. ఈరోజుల్లో ఆల్కహాల్ తీసుకోవడం ఫ్యాషన్ గా మారింది. కానీ మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకే తీసుకుంటున్నామని చెబుతున్నారు. అయితే పరిమితి మించితే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. భవిష్యత్తలో జరిగే ప్రమాదం కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలాక్స్ కావడానికి అల్కహాల్ మచ్ బెటర్ అని అంటున్నారు. వాస్తవానికి మద్యపానం తీసుకుంటే మనసుకు ఉల్లాసంగా ఉంటుందా..? ఆ తరువాత ఏం జరగబోతుంది..?

మద్యంపానం పరిమితిగా తీసుకుంటే ప్రమాదమేమి కాదని వైద్యులు అంటున్నారు. కానీ మద్య సేవనం పరిమితితో ఆగిపోదు. దాని డోస్ పెంచుకుంటూ పోతూనే ఉంటారు. మొదటిరోజు ఒక గ్లాసు చాలనుకునే వారు రాను రాను పెద్ద మొత్తంలో తీసుకునేందుకు అలవాటుపడుతారు. ఎంత ఎక్కువ మద్యం తీసుకుంటే అంత రిలాక్స్ అవుతుందని కొందరి భావన. అందుకే ఇష్టమొచ్చిన రీతిలో ఆల్కహాల్ సేవించి ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. కొందరు రిలాక్స్ కోసమని చెప్పినా.. దానిని అపరిమిత స్థాయిలో సేవించడం వల్ల మెదడుపై ప్రభావం చూపుతోందని వైద్యులు అంటున్నారు.
ఒకప్పుడు ఆరోగ్యం కోసం మద్యపానం సేవించేవారు. 19వ శతాబ్దంలో వివిధ దేశాల్లో పర్యటించిన యాత్రికులు తమ ఆరోగ్యం కోసం మద్యపానాన్ని తీసుకునేవారు. విక్టోరియా యాత్రికులు రోజంతా ప్రయాణించి అలసిపోయిన తరువాత చల్లటి వాతావరణాన్ని తట్టుకునేందుకు ఒక గ్లాస్ రమ్ము తీసుకునేవారు. కొందరికి ఒళ్లు నొప్పులు రావడం వల్ల నిద్రపట్టడానికి, ప్రశాంతతకు దీనిని తీసుకునేవారు. అలాగే తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ పర్యాటకులు కరూడా రోజంతా చేసిన ప్రయాణం ముగిసిన తరువాత మితంగా మద్యం సేవించేవారు. ప్రయాణాల వల్ల వచ్చిన జ్వరం, అలసట తీరడానికి ఇది ఒక ఔషధంలా పనిచేసేది.
ఏదైనా ఒక పనిలో తీవ్ర ఒత్తిడి కలిగిన వ్యక్తి కాస్త మద్యం పుచ్చుకుంటే తాత్కాలికంగా డిప్రెషన్ నుంచి తగ్గిస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ చర్యలను నిరోధిస్తుంది. కొంత మంది సిద్ధాంతకర్తలు మనిషి శరీరాన్ని సంతులనంలో ఉంచాల్సిన ఒక వ్యవస్థలా భావించారు. దీంతో ఆరోగ్యం కోసం ఇలాంటి రూట్లను ఎంచుకునేవారు. అప్పట్లో స్వల్ప రోగాలకు పాల్పడిన వారు స్టిములంట్స్ ను ముఖ్యమైన ఔషధాలుగా భావించారు. అయితే శాస్త్రవేత్తలు, వైద్యుల వాదనలతో మద్యం తీసుకోవడంపై ఎలాంటి క్లారిటీ రాలేకపోయింది.
ఇదిలా ఉండగా యాత్రికులు మద్యం సేవించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో అప్పటి వరకు మద్యంపై ఉన్నశాస్త్రీయ దృక్ఫథం మారింది. ఇది ఎక్కువగా ఉద్యమం కారణంగా జరిగింది. ఇది ఎవాంజెలికల్ క్రిస్టియానిటీలో వేళ్లూకుపోయింది. దీంతో మద్యం అమ్మకాలను నీరుగార్చింది. ఇలా రాను రాను మద్యం పై వ్యతిరేక ధోరణి మారింది. అప్పటి వరకు ఆరోగ్యం కోసం మద్యం సేవించాలనుకున్నవారు ప్రతికూల పరిస్థితుల్లో కూడా మద్యపానం హానికరం అని భావించారు. 1875-76 సంవత్సరంలో ది నేషనల్ అర్కిటిక్ ఎక్స్ పెడిషన్ నిర్వహించిన సాహసయాత్రలో రమ్ ను పరిమితంగా పంపిణీ చేశారు. అయితే ఈ యాత్రలో పాల్గొన్న వారిలో కొందరు అతిగా మద్యం సేవించిన వారు కూడా ఉన్నారు. కొన్ని రోజుల తరువాత వీరిలో స్కర్వీ వ్యాధి బయటపడింది. దీంతో మద్యపానం కవర్ చేసుకోవడానికి కొందరు యాత్రికులు మితంగా ఔషధంగా మాత్రమే తీసుకుంటున్నామని వాదించారు.
[…] DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కొత్త చిత్రం ‘డీజే టిల్లు’. ఇక ఈ సినిమాకి ‘అట్లుంటది మనతోని’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నేహాశెట్టి కథానాయిక నటిస్తోంది. కొత్త దర్శకుడు విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదల అయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతుంది. […]