Butta Bomma Movie Review: నటీనటులు : అనికా సురేంద్రన్ , అర్జున్ దాస్ , సూర్య వసిష్ఠ , నవ్య స్వామి
బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : సూర్య దేవర నాగవంశీ
డైరెక్టర్ : రమేష్
మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్

ఈమధ్య కాలం లో నిర్మాణ రంగం లోకి దూసుకొచ్చిన సంస్థ ‘సితార ఎంటర్టైన్మెంట్స్’..ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమారుడు సూర్యదేవర నాగ వంశీ స్థాపించిన ఈ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిచింది..విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన ‘బాబు బంగారం’ అనే సినిమా ద్వారా ఈ సంస్థ లాంచ్ అయ్యింది..కానీ మొట్టమొదటి భారీ హిట్ మాత్రం ‘DJ టిల్లు’ తోనే దక్కింది..ఆ తర్వాత మరుసటి నెలలో ఇదే సంస్థ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వచ్చింది.ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే,ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు..ఇలా ఒక పక్క క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూనే మరోపక్క చిన్న సినిమాలను కూడా నిర్మిస్తుంది ఈ సంస్థ..ఇప్పుడు ఈ సంస్థ తెరకెక్కించిన మరో చిన్న సినిమా ‘బుట్ట బొమ్మ’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘కప్పేలా’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ కి నచ్చిందో లేదో చూద్దాము.
కథ :
అరకు ప్రకృతి అందాల మధ్య ఉన్న దూది కొడుకు చెందిన ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి సత్య(అనికా సురేంద్రన్) చాలా సాదాసీదా జీవితం ని గడుపుతూ ఉంటుంది..అమ్మ , నాన్న , చెల్లి మరియు ఇష్టంగా పూజించే శ్రీకృష్ణుడు..ఇవే ఆమె లోకం,జానీ అందరికీ చిన్న చిన్న కోరికలు ఉన్నట్టే ఈమెకి కూడా ఒక కోరిక ఉంటుంది..ఒక కెమెరా ఫోన్ కొనుక్కొని , ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసి బాగా ఫేమస్ అవ్వాలి అని అనుకుంటుంది..కానీ అనుకోకుండా వచ్చిన ఒక రాంగ్ ఫోన్ కాల్ సత్య జీవితాన్నే మార్చేస్తుంది..ముక్కు మొహం కూడా చూడకుండానే ఆ ఫోన్లో పరిచయమైనా మురళి(సూర్య వసిష్ఠ) తో ప్రేమలో పడుతుంది..ఆ తర్వాత అతనిని కలవడానికి కోసం వైజాగ్ కి వస్తుంది..ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది..మరి మురళి ని కలవడానికి వెళ్లిన సత్య కి ఎదురైనా అనుభవాలు ఏమిటి..వీళ్ళని ఆర్కే(అర్జున్ దాస్ ) అలా వెంబడించాడు కారణం ఏమిటి వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :
ఈ సమాజం లో ఆడపిల్ల మీద జరిగే అకృత్యాలు అఘాయిత్యాలను మనం రోజు టీవీలలో మరియు న్యూస్ పేపర్స్ లో చూస్తూనే ఉంటాము..వాటికి అద్దం పట్టేలాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ రమేష్..ఫస్ట్ హాఫ్ మొత్తం మంచిగానే సాగిపోయింది..కానీ సెకండ్ హాఫ్ మాత్రం లవ్ స్టోరీ నుండి థ్రిల్లర్ జానర్ లోకి సినిమా టర్న్ తీసుకుంటుంది,అయితే ఇలా ఫోన్ కాల్ ద్వారా ముక్కు మొహం చూసుకోకుండా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల జంట కి సంబంధించిన స్టోరీలు ఇదివరకే మన టాలీవుడ్ లో బోలెడన్ని సినిమాలను చూసారు ప్రేక్షకులు..మళ్ళీ అదే పాయింట్ మీద సినిమా తియ్యాలంటే కచ్చితంగా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టె విధంగా చూసుకోవాలి డైరెక్టర్..లేకుంటే మొదటికే మోసం వచేస్తాది..ఈ సినిమా విషయం లో డైరెక్టర్ అక్కడే ఫెయిల్ అయ్యాడు..కానీ పతాక సన్నివేశం లో వచ్చే ట్విస్టులు మాత్రం క్లిక్ అయ్యాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే పల్లెటూరి అమ్మాయిగా అనికా పాత్రలో లీనమైంది..ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ గా చెప్పుకోవచ్చు..అమాయకత్వం , చిలిపితనం అదే సమయం లో సమస్యల్లో చిక్కుకున్నపుడూ ఆమె పండించిన ఎమోషన్స్ అన్నీ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటాయి..ఇక ఈ సినిమాతోనే ఇండస్ట్రీ కి పరిచయమైనా సూర్య వసిష్ఠ కూడా తన పాత్రకి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసాడు..రెండు డిఫరెంట్ షేడ్స్ తో సాగిపోతుంది అతని పాత్ర, ఇక ఆర్కే గా అర్జున్ దాస్ నటన కూడా అద్భుతం..చివర్లో ఆయన పాత్ర ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది..ఇలాంటి జానర్ లో తెరకెక్కిన సినిమాలకు సంగీతం ఆయువు పట్టులాంటిది..కానీ ఒక్క పాట కూడా ఈ చిత్రం నుండి హైలైట్ అయ్యినవి లేకపోవడం మరో మైనస్ గా చెప్పుకోవచ్చు..ఇక గణేష్ రావూరి అందించిన సంభాషణలు పర్వాలేదని అనిపించాయి.
చివరి మాట : ఒకసారి అయితే ఈ చిత్రాన్ని పక్కాగా చూడవచ్చు..అలా టైం పాస్ అయిపోతుంది.
రేటింగ్ : 2.5 /5