Pawan Kalyan Bus Yatra : రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎంతలా అంటే.. ముహూర్తాలు చూసి మరీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాడు. కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి రాష్ట్రంలో నేతల వరకూ ‘ముహూర్తాల మారాజు’ అని కేసీఆర్ విమర్శలు గుప్పించినా.. కేసీఆర్ నమ్మిన సెంటిమెంట్ రుజువైంది. కొందరికి కొన్ని కలిసి వస్తాయి. అలాగే ఏపీలో పూర్వం రాజకీయ పార్టీ పెట్టిన సీనియర్ ఎన్టీఆర్ కేవలం 9 నెలల్లోనే రాష్ట్రమంతా ఒక చైతన్య రథం అనే వినూత్న బస్సులో ప్రయాణించి అందులోనే ఉండి రాజ్యాధికారం సాధించాడు. ఆ బస్సు పవన్ కు సెంటిమెంట్ గా బాగా కలిసి వచ్చింది. ఎన్టీఆర్ కు తోడుగా ఆయన కుమారుడు హరికృష్ణ రాష్ట్రమంతా దాన్ని స్వయంగా నడిపి మరీ తండ్రి గెలుపునకు సహకరించాడు.

ఇప్పుడు అచ్చం పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో బస్సు యాత్రకు ఎన్టీఆర్ మోడల్ ను అనుసరిస్తున్నారు. ఎన్టీఆర్ వాడిన చైతన్య రథాన్ని పోలిన బస్ ను తయారు చేయించాడు. తాజాగా పవన్ విడుదల చేసిన ఆ బస్సు ఫొటోలు వైరల్ గా మారాయి. పవన్ తయారు చేసే చైతన్య రథానికి రెగ్యులర్ బస్ లు, లారీలకు వాడే పెద్ద టైర్లు వాడారు. వర్క్ షాప్ లో స్పెషల్ గా తయారు చేస్తున్న ఈ బస్ ఎక్స్ క్లూజివ్ ఫొటోలను పవన్ స్వయంగా ట్వీట్ చేశాడు.
ఈ బస్సుపైన పవన్ ప్రసంగించడానికి వీలుగా చుట్టూ రక్షణ రెయిలింగ్ లు.. బస్సులో పవన్ బస చేసేలా.. ఆయన కాలకృత్యాలకు ఏర్పాట్లు చేశాడు. రాత్రి పడుకోవడానికి బెడ్.. నేతలతో బస్సులో మాట్లాడడానికి సరిపడా స్థలం.. టీవీ.. ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక బస్ కు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం కూడా ఏర్పాటు చేశారు. ఎంత దూరంలో ఉన్న వారికి కూడా పవన్ కనిపించేలా బస్ టాప్ లో ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా ఈ బస్సును పవన్ కళ్యాణ్ ఘనంగా లాంచ్ చేశాడు. ముందు సిక్కు బాడీ గార్డులు నడుచుకుంటూ వస్తుండగా వెనుకాల ఈ బస్సు ఠీవీగా కదిలివచ్చింది. దాని చుట్టూ.. మీద ఎక్కి కొంతమంది సెక్యూరిటీగార్డులు ప్రయాణిస్తున్నారు. బస్సు ఎంట్రీనే ఇంత అద్భుతంగా డిజైన్ చేసిన పవన్ కళ్యాణ్ ఇక బరిలోకి దిగితే ఈ బస్సుతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచిచూడాలి.
వచ్చే ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఈ యాత్ర జరిగినన్నీ నాళ్లు పవన్ నాడు ఎన్టీఆర్ తరహాలోనే ఈ బస్ లోనే ఉంటారు. ఆయన అలవాట్లు, అవసరాలకు తగినట్లుగా ఇందులో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచుతున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి..? రూట్ మ్యాప్ ఎలా ఉండాలి? అన్నది ప్రకటించాల్సి ఉంది. వైసీపీని ఓడించడం.. జనసేనను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పవన్ ఈ బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022