Ravi Teja: మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో మంచి బిజీ గా ఉన్నాడు..చాలా కాలం ఫ్లాప్స్ తర్వాత ఆయన నటించిన క్రాక్ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘ఖిలాడీ’ చిత్రం మాత్రం యావరేజి గ్రాస్సర్ గా నిలిచింది..ఇక ఆ సినిమా తర్వాత ఈ ఏడాది విడుదలైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం ఈ నెల 25 వ తారీఖున థియేటర్స్ లో విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది..ప్రముఖ డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది..ఈ మూవీ పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..ఎందుకంటే ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ మరియు పాటలకు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ తన దగ్గర పని చేసే మేనేజర్ కి విలువైన కారుని బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అందుకు సంబంధించిన వీడియో అతని మేనేజర్ సోషల్ మీడియా లో షేర్ చేసాడు..ఈ వీడియో లో రవితేజ ఇంటి నుండి బయటకి అడుగుపెట్టగానే మేనేజర్ ఆయనకీ కాళ్ళకి దండం పెడుతాడు..ఆ తర్వాత ఇద్దరు కలిసి కారులో షూటింగ్ స్పాట్ కి బయలుదేరుతారు..టాటా కంపెనీ కి చెందిన ఈ కారు విలువ సుమారు 22 లక్షల రూపాయిలు ఉంటుందట.

తన దగ్గర పని చేస్తున్న వాళ్ళను సొంత కుటుంబ సభ్యులు లెక్క ట్రీట్ చేస్తున్న రవితేజ పై అభిమానులు సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ఇది ఇలా ఉండగా రవితేజ ‘ధమాకా’ అనే సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే..ఈ చిత్రం జనవరి 13 వ తేదీన విడుదల కాబోతుంది.