BRS – BSP : బీఆర్ఎస్ తో బీఎస్సీ పొత్తు.. కేసీఆర్ – ఆర్ఎస్ ప్రవీణ్ పెద్ద స్కెచ్

బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు వల్ల దళిత ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ కు పడేలా కేసీఆర్ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దళితుల ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీచేయడంతో వారంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యన విడిపోయారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు బీఎస్పీతో పొత్తు వల్ల దళిత ఓటు బ్యాంకు గులాబీ గూటికి చేరుతుందని కేసీఆర్ ఈ పొత్తు స్కెచ్ కు తెరతీసినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఈ పొత్తుకు అంగీకారం తెలిపినట్టు ప్రచారం సాగుతోంది. 

Written By: NARESH, Updated On : March 5, 2024 5:31 pm
Follow us on

BRS – BSP : పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో సంచలనం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఏకంగా ఆయనతోనే భేటీ అయ్యారు. మంగళవారం నంది నగర్ లోని కెసిఆర్ ఇంటికి వెళ్లి పుష్ప గుచ్ఛమిచ్చి చాలా విషయాల మీద చర్చించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు..లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు పార్లమెంటు స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత.. మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొన్నటి ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. అంతకుముందు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి కవితని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర కూడా చేశారు.. సిర్పూర్ కాగజ్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్త పొత్తు పొడిచినట్టు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎంపీ ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ తో కలిసి పోటీచేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు చర్చలు జరిపారు.

ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాజకీయపరంగా యాక్టివ్ గా లేరు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెడుతున్నారు. బహుజన్ సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ మంగళవారం అనూహ్యంగా కేసీఆర్ ను కలవడం పట్ల రాజకీయంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రవీణ్ కుమార్ బీఎస్పీతో భారత రాష్ట్ర సమితికి పొత్తు కుదుర్చి త్వరలో ఆయన  నాగర్ కర్నూల్ లేదా వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడిగా మొన్నటిదాకా రాములు కొనసాగారు. అయితే ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి ప్రవీణ్ కుమార్ ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కేసీఆర్ కూడా ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఆయన మంగళవారం కేసీఆర్ ను కలిసినట్టు తెలుస్తోంది. ఒకవేళ నాగర్ కర్నూల్లో కుదరకపోతే వరంగల్ నుంచైనా బీఆర్ఎస్ మద్దతుతో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్ కుమార్ కెసిఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరిగింది. పైగా తన బంధువు మెతుకు ఆనంద్ కు వికారాబాద్ అసెంబ్లీ స్థానం టికెట్ కూడా ఇప్పించుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అప్పటిదాకా గురుకుల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్ -1 పేపర్ లీకేజీ పై ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు..సిర్పూర్ స్థానం నుంచి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు ఈ భేటీని మర్యాదపూర్వకంగానే చూడాలని భారత రాష్ట్రపతి నాయకులంటున్నారు. ఇద్దరు కీలక నాయకులు కలిసినంతమాత్రానా వాటికి రకరకాల వక్రీకరణలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రవీణ్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరబోరని, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి తో పొత్తు పెట్టుకుంటారని బీఎస్పీ నాయకులు అంటున్నారు.

బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు వల్ల దళిత ఓట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ కు పడేలా కేసీఆర్ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దళితుల ఓట్లు మెజార్టీ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యాయి. బీఎస్పీ ఒంటరిగా పోటీచేయడంతో వారంతా బీజేపీ, కాంగ్రెస్ మధ్యన విడిపోయారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపలేదు. ఇప్పుడు బీఎస్పీతో పొత్తు వల్ల దళిత ఓటు బ్యాంకు గులాబీ గూటికి చేరుతుందని కేసీఆర్ ఈ పొత్తు స్కెచ్ కు తెరతీసినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఈ పొత్తుకు అంగీకారం తెలిపినట్టు ప్రచారం సాగుతోంది.