https://oktelugu.com/

Ghattamaneni Family: ఘట్టమనేని ఫ్యామిలీ లో హీరోలు పెరుగుతున్నారు సరే.. మరి సక్సెస్ ల మాటేంటి..?

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా విపరీతంగా కష్టపడడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది...

Written By:
  • Gopi
  • , Updated On : November 24, 2024 / 09:43 AM IST

    Ghattamaneni Family

    Follow us on

    Ghattamaneni Family: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇప్పటికే చాలామంది హీరోలు వారసత్వం పరంగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్ళు అడపా దడపా సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వారసత్వ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారే కావడం విశేషం… ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ, నందమూరి, అక్కినేని, ఘట్టమనేని ఫ్యామిలీలు ఇండస్ట్రీలో తమ చక్రాన్ని తిప్పుతున్నాయి. ఇక మొన్నటిదాకా ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు ఒక్కడే స్టార్ హీరోగా వెలుగొందుతున్న క్రమంలో ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇక మహేష్ బాబుతో పాటు సుదీర్ బాబు ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. ఇక వీళ్ళతోపాటుగా ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు ఆయన అశోక్ గల్లా కూడా హీరోగా తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన హీరో అని ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు సాకేస్ సాధించలేదు. దాంతో ఇప్పుడు ‘దేవకీ నందన వసుదేవ’ అనే సినిమాని చేశాడు. అయితే ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది.

    మరి ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోయిందని కొంతమంది ఈ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అశోక్ గల్లా కూడా ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ హీరోగా ఎదగడానికి ముందుకు వస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక మహేష్ బాబు తనకి అండగా ఉండడంతో మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసిన ఆయన తొందర్లోనే ఇంకా కొన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో వారసుల హవా అనేది బీభత్సంగా పెరిగిపోతుంది. మరి కొత్త హీరోలకు ఇక్కడ అవకాశం లేదా అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు పాన్ ఇండియా లో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దర్శకుడు గానీ, హీరోగాని వాళ్ళని వాళ్లు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తే వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ అయితే ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…