NTR Prashanth Neel Movie Title: ఈమధ్య కాలం లో పాత సినిమాల టైటిల్స్ కొత్త సినిమాలకు పెట్టడం చాలా కామన్ అయిపోయింది. చిన్న సినిమాలు అంటే అనుకోవచ్చు, పాన్ ఇండియా తరహా లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా పాత సినిమాల టైటిల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత రెండు రోజుల క్రితమే ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీ కి బ్రూస్లీ తో లింక్ ఉందనే వార్త మీరంతా వినే ఉంటారు. ఏమి లింక్ ఉండొచ్చు?, బ్రూస్లీ ని AI ద్వారా ఈ సినిమాలోకి తీసుకొస్తున్నారా?, లేదా ఏదైనా పాత్రనా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. అయితే ‘బ్రూస్లీ’ అనేది ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు అని తెలుస్తోంది. ఇన్ని రోజులు ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పెడతారని అంతా అనుకున్నారు. కానీ చివరికి ‘బ్రూస్లీ ‘ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్.
గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బ్రూస్లీ – ది ఫైటర్’ అనే చిత్రం వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ చిత్రం గా నిల్చింది. ఇప్పుడు అదే టైటిల్ ని ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ కి పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, ‘డ్రాగన్’ టైటిల్ చాలా బాగుంది, దయచేసి ఆ టైటిల్ నే ఫిక్స్ చేయండి, బ్రూస్లీ టైటిల్ అసలు ఏమి బాగాలేదు, పైగా ఫ్లాప్ సినిమా టైటిల్ వైబ్స్ వస్తున్నాయి అంటూ సోషల్ మీడియా లో మేకర్స్ ని అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సినిమాకు ఆ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని, పాన్ ఇండియా లెవెల్ లో బాగా కలిసొచ్చే టైటిల్ అంటున్నారట.
మరి ఏ టైటిల్ ని ఫిక్స్ చేయబోతున్నారు అనేది అధికారికంగా తెలియాంటే మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జోర్డాన్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ పై కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక, హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో షూటింగ్ కొనసాగించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే చివరి ఫారిన్ షెడ్యూల్ అట. ఇక హైదరాబాద్ లోనే షూటింగ్ ఉంటుందట. ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణీ వాసంత్ నటిస్తోంది. మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ ఇందులో విలన్ గా నటించబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ కి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారు కానీ, అది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి.
