Homeజాతీయ వార్తలుBRS Parliamentary Meeting: మాట్లాడుకుందాం రండి.. కేసీఆర్‌ అత్యవసర పిలుపు..!

BRS Parliamentary Meeting: మాట్లాడుకుందాం రండి.. కేసీఆర్‌ అత్యవసర పిలుపు..!

BRS Parliamentary Meeting: కేసీఆర్‌ కొన్ని నెలలుగా తరచూ కార్యవర్గ సమావేశాలు లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు సమాచారం ఇచ్చి రేపు మీటింగ్‌ పెట్టేస్తున్నారు. ఆయన ప్రతీసారి మీటింగ్‌లో ఏదో చెప్పాలనుకుంటున్నారని .. చెప్పలేకపోతున్నారని అనుకుంటున్నారు. మరోసారి ఆయన ఇలాంటి సమావేశానికి పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అధ్యక్షతన బుధవారం బీఆర్‌ఎస్‌ లెజిస్లేటీవ్, పార్లమెంటరీ పార్టీ భేటీ ఉంటుందని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరు కావాలని ప్రగతి భవన్‌ నుంచి సమాచారం పంపారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సమావశంలో కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్న దానిపై స్పష్టత లేదు. మొన్నటిదాకా ఇలా ప్రజాప్రతినిధులు లేదా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ముందస్తు ఎన్నికల గురించి ఏమైనా చెబుతారేమో అనుకునేవారు. అయితే ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. వచ్చే ఆరు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

నవంబర్‌లో ఎన్నికలని..
గత సమావేశంలో నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ నిర్ణయాన్ని కూడా కేసీఆర్‌ ప్రకటించేశారు. అక్టోబర్‌ నాటికి అందరూ రెడీగా ఉండాలని పార్టీ ప్రజాప్రతినిదులు, నేతలకు సూచించారు. కానీ అలా జరిగే అవకాశం వన్‌ పర్సెంట్‌ కూడా లేదు. డిసెంబర్‌ మొదటి వారంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనుండగా.. ఒక్క తెలంగాణకే విడిగా ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. కాబట్టి..త కేసీఆర్‌ చెప్పినట్లుగా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం లేదంటున్నారు.

ఎన్నికల వాయిదాపై చర్చించే చాన్స్‌..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆర్డినెన్స్‌ తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నిలు పోస్ట్‌పోన్‌ చేస్తే దానిని న్యాయపరంగా ఎలా ఎదుర్కొవాలి. బీజేపీని తీరును ప్రజల్లో ఎలా ఎండగట్టాలి అనే విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి లబ్ధి కలుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అలర్ట్‌ అయినట్లు తెలుస్తోంది.

టికెట్లు రానివారి బుజ్జగింపు..
ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ల ఇచ్చే అవకాశం లేదో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తారని తెలుస్తోంది. పార్టీ వీడకుండా ప్రత్యామ్నాయ పదవులు ఆశ చూసే అవకాశం కూడా ఉందని సమాచారం. మొత్తంగా అత్యవసర సమావేశం వెనుక భారీ స్కెచ్‌ ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల సమాచారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular