Sai Pallavi: హోమ్లీ బ్యూటీ సాయి పల్లవి ఒక అబ్బాయిని ఘాడంగా ప్రేమించారట. అతనికి ప్రేమ లేఖ కూడా రాశారట. అంతలోనే చిన్న ట్విస్ట్ చోటు చేసుకుందట. సాయి పల్లవి నేరుగా తన లవ్ స్టోరీ బయటపెట్టిన నేపథ్యంలో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు కూడా ఒక ప్రేమ కథ ఉందన్నారు. ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లో నా క్లాస్ మేట్ మీద మనసు పడ్డాను. ఎందుకో అతనంటే తెలియని ఆకర్షణ. నా ప్రేమను వ్యక్తం చేయడం కోసం లెటర్ రాశాను. అది అతనికి ఇవ్వలేకపోయాను.
లవ్ లెటర్ నా పుస్తకాల్లో దాచాను. అది కాస్తా మా అమ్మ కంటపడింది. నన్ను చితకబాదింది. మా అమ్మ నన్నుక కొట్టడం అదే మొదటిసారి. అలాగే చివరిసారి కూడాను. ఆ రోజు నుండి నేను అమ్మకు ఇష్టం లేని పనులు చేయకూడదని నిర్ణయించుకున్నాను. కొట్టినా కోప్పడినా నా దృష్టిల్లో అమ్మ ఒక హీరోయిన్. ఆమెను ఎంతగానో ప్రేమిస్తాను, అని సాయి పల్లవి చెప్పుకొచ్చారు. కాబట్టి ఏడో తరగతి చదివేటప్పుడే సాయి పల్లవికి ప్రేమ కలిగింది. ఒక అబ్బాయిని ఇష్టపడ్డారన్న మాట.
మరి ఆ అబ్బాయికి సాయి పల్లవి ఇష్టపడిన విషయం తెలుసో లేదో. తెలిస్తే థ్రిల్ ఫీలై ఉంటాడు. నన్ను చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ అయ్యిందని గర్వపడేవాడు కాబోలు. తెలియకపోతే సాయి పల్లవితో పాటు ఏడో చదివిన బాయ్స్ మొత్తం ఎవరా లక్కీ ఫెలో, నేను కూడా కావచ్చని మదనపడుతుంటారు. సాయి పల్లవి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. ఆమెకు మొదటి నుండి యాక్టింగ్ పై మక్కువ ఉంది. అదే సమయంలో పేరెంట్స్ కోరిక మేరకు చదువు కూడా పూర్తి చేశారు.
జార్జియా దేశంలో సాయి పల్లవి మెడిసిన్ చదివారు. అనంతరం నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు. హీరోయిన్ గా సాయి పల్లవి మొదటి చిత్రం ప్రేమమ్. ఈ మలయాళ చిత్రం సూపర్ హిట్ కావడంతో సాయి పల్లవికి ఆఫర్స్ వచ్చాయి. ఫిదా చిత్రంతో తెలుగులో భారీ పాపులారిటీ తెచ్చుకుంది. సాయి పల్లవి చేసింది తక్కువ చిత్రాలు అయినప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.