Bigg Boss 7 Telugu – Rathika : రతికా రోజ్ ని ఉద్దేశిస్తూ బ్రహ్మముడి సీరియల్ యాక్టర్ మానస్ వాట్సప్ చాట్… చివర్లో ట్విస్ట్!

అందులో బిగ్ బాస్ ఫేమ్ రతిక గురించి ఉంది.దీనిపై స్పందించిన మానస్ అది తన నెంబర్ కాదు అని స్పష్టం చేశాడు. అది మానస్ చేసిన చాటింగ్ కాదని అందరికి క్లారిటీ వచ్చింది.

Written By: NARESH, Updated On : October 16, 2023 10:30 am
Follow us on

Bigg Boss 7 Telugu – Rathika : కోయిలమ్మ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మానస్. తర్వాత బిగ్ బాస్ షో లో కి రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఫుల్ పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చాడు మానస్. తన మంచితనం తో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న మానస్ టాప్ 5 దాకా వెళ్ళాడు.ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని బాగా వాడుకున్నాడు. సీరియల్స్, షోస్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

సోషల్ మీడియాలో కూడా మానస్ కి ఫాలోయింగ్ బానే ఉంది. విష్ణు ప్రియ తో కలిసి ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నాడు.ఈ ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి.ఇప్పుడు మానస్ బ్రహ్మ ముడి సీరియల్ ఇంకా స్టార్ మా లో ప్రసారమయ్యే షోస్ తో ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ మధ్యనే శ్రీజ అనే అమ్మాయి తో మానస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి డేట్ అనౌన్స్ చేయనున్నాడు.పెద్దలు కుదిర్చిన సంబంధంతో ఒక ఇంటి వాడు కాబోతున్నాడు మానస్.

అయితే, తన పేరు మీదుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక వాట్సాప్ నెంబర్ పై స్పందించాడు. అది తన వాట్సాప్ నెంబర్ కాదని, తాను చాట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. స్క్రీన్ షాట్ చూపించాడు. అందులో బిగ్ బాస్ ఫేమ్ రతిక గురించి ఉంది.దీనిపై స్పందించిన మానస్ అది తన నెంబర్ కాదు అని స్పష్టం చేశాడు. అది మానస్ చేసిన చాటింగ్ కాదని అందరికి క్లారిటీ వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న మానస్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సీజన్లో సన్నీ, షణ్ముఖ్ టైటిల్ పోరులో నిలిచారు. చివరికి ఆడియన్స్ సన్నీకి టైటిల్ కట్టబెట్టారు. ఇక రతికా రోజ్ విషయానికి వస్తే సీజన్ 7లో పాల్గొంది. ఆమె నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది. మారాలా రీఎంట్రీ ఇచ్చేందుకే సిద్ధమైంది. ఆమె రీ ఎంట్రీ హౌస్ మేట్స్ డెసిషన్ పై ఆధారపడి ఉంది.