Pakistan vs Iran : పాకిస్తాన్, ఇరాన్ దొందూ దొందే, ఇద్దరూ ప్రపంచ శాంతికి ముప్పే

పాకిస్తాన్, ఇరాన్ దొందూ దొందే, ఇద్దరూ ప్రపంచ శాంతికి ముప్పే’ ఈ రెండు దేశాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 19, 2024 4:20 pm
Follow us on

Pakistan vs Iran : ఇరాన్-పాకిస్తాన్ కొట్టుకుంటున్నాయి.. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి. రెండూ దేశాలు ఉగ్రవాద ఉత్పత్తి దేశాలే కావడం విశేషం. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్ లోనే ఉంటున్నాయి. ఇక ఇరాన్ ఏం తక్కువ తినలేదు. ఎర్రసముద్రంలో హౌతీల దాడి వెనుక ఉన్నది ఇరాన్.. ఇక ఇజ్రాయిల్ మీద దాడి చేసిన హమాస్ ఉగ్రవాదులకు అండదండలు అందించింది ఈ ఇరాన్ దేశమే. పశ్చిమాసియాలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది ఇరాన్.

పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం లక్ష్యంగా ఇరాన్ అకస్మాత్తుగా క్షిపణులతో దాడులు చేసింది. ఒక్కో క్షిపణికి 1200 నుంచి 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేదించగల సామర్థ్యం ఉంటుంది. అలాంటి వాటిని ఇరాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో లెక్కపెట్టలేని విధంగా ప్రయోగించింది. ఇరాన్ అకస్మాత్తుగా ఇలా క్షిపణులు ప్రయోగించడం పట్ల మొదట పాకిస్తాన్ కూడా విస్మయం వ్యక్తం చేసింది. ఆ తర్వాత గగనతల ఒప్పందాన్ని ఇరాన్ అతిక్రమించిందని ఆరోపించింది.

ఇక ప్రతిగా పాకిస్తాన్ కూడా ఇరాన్ లోని పాకిస్తాన్ వ్యతిరేక ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిజానికి షియా ఉగ్రవాద సంస్థలకు కర్త కర్మ క్రియ ఇరాన్ నే. ఇరాక్ లోని అమెరికా సైనికుల మీద దాడులు చేస్తోంది కూడా ఇరాన్ మద్దతుదారులు.. సున్నీ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంటే.. షియా ఉగ్రవాదాన్ని ఇరాన్ పెంచిపోషిస్తోంది.

పాకిస్తాన్, ఇరాన్ దొందూ దొందే, ఇద్దరూ ప్రపంచ శాంతికి ముప్పే’ ఈ రెండు దేశాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.