
Vasantha Kokila Trailer Review : నేషనల్ అవార్డు విన్నర్ బాబీ సింహ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో మెయిన్ విలన్ ప్రకాష్ రాజ్ తమ్ముడు పాత్ర చేసి మెప్పించారు. ఆయన హీరోగా నటించిన చిత్రం వసంత కోకిల. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వసంత కోకిల ట్రైలర్ చూసిన చిరంజీవి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. వసంత కోకిల మంచి విజయం సాధించాలని బెస్ట్ విషెస్ తెలియజేశారు. చిరంజీవి ట్రైలర్ విడుదల చేయడం ద్వారా వసంత కోకిల చిత్రానికి మంచి ప్రచారం దక్కింది.
ఇక ట్రైలర్ చూస్తే… వసంత కోకిల హారర్, క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది. ఓ క్రైమ్ డ్రామాకు క్లాసిక్ టైటిల్ ఎందుకు పెట్టారనేది ఆసక్తికరం. టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటో మూవీ చూస్తే కానీ తెలియదు. ట్రైలర్ లో మాత్రం ఓ హోటల్ పేరుగా చూపించారు. జాబ్ టెన్షన్స్ నుండి దూరంగా లవర్ తో జాలీ ట్రిప్ కి వెళ్లిన హీరోకి ఎదురైన భయానక పరిస్థితుల సమాహారమే వసంత కోకిల.
ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్న మారుమూల హోటల్ లో హీరో-హీరోయిన్ దిగుతారు. అప్పటి నుండి వారికి కష్టాలు మొదలవుతాయి. ఆ హోటల్ లో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. వారికి ఎదురయ్యే భయానక అనుభవాల వెనుక ఎవరున్నారు? వారిని టార్గెట్ చేసింది ఎవరు? ఆ సమస్యల నుండి హీరో, హీరోయిన్ ఎలా బయటపడ్డారనేది? వసంత కోకిల మూవీ అని ట్రైలర్ ఆధారంగా చెప్పవచ్చు.
ఆసక్తికర విషయం ఏమిటంటే… హీరో ఆర్య కీలక రోల్ చేశారు. వసంత కోకిల చిత్రంలో అతని పాత్ర ఏమిటనేది ఆసక్తికరం. ఆర్యనే అసలు విలన్ అయ్యే అవకాశం కూడా కలదు. బాబీ సింహకు జంటగా కాశ్మీరా పరదేశి నటిస్తున్నారు. రామనన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నారు. రజని తాళ్లూరి, రేష్మీ సింహ నిర్మాతలుగా ఉన్నారు. రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 10న తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేస్తున్నారు.