https://oktelugu.com/

శనివారం శివునికి నువ్వులు, నీళ్లు సమర్పిస్తే..!

నవగ్రహాలలో ఒకటైన శనికి శనివారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం శివుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించడం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.ఈ క్రమంలోనే శనివారం నవగ్రహాలలో శనీశ్వరునికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనీశ్వరుడిని ఎప్పుడు శని, శని అని పిలవకూడదు. శని దేవుడు ఈశ్వరుని అంశం కనుక ఈ దేవుడిని శనీశ్వరుడు అని పిలవాలి. శని దేవుడు ఈశ్వరుని అంశం కనుక శనివారం ఆ పరమశివుని పూజించిన శని దోషాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 20, 2021 4:18 pm
    Follow us on

    Lord Shiva

    నవగ్రహాలలో ఒకటైన శనికి శనివారం అంటే ఎంతో ప్రీతికరమైన రోజు. శనివారం శివుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహించడం వల్ల ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.ఈ క్రమంలోనే శనివారం నవగ్రహాలలో శనీశ్వరునికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. అదేవిధంగా శనీశ్వరుడిని ఎప్పుడు శని, శని అని పిలవకూడదు. శని దేవుడు ఈశ్వరుని అంశం కనుక ఈ దేవుడిని శనీశ్వరుడు అని పిలవాలి. శని దేవుడు ఈశ్వరుని అంశం కనుక శనివారం ఆ పరమశివుని పూజించిన శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

    Also Read: అంగారకుడి నుంచి మార్స్‌ ఛాయా చిత్రాలు..: ఆశ్చర్యపోతున్న నాసా సైంటిస్టులు

    శనికి ఇష్టమైన శనివారం శివుడికి పూజ చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అదేవిధంగా శని దోషాలను నుంచి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శనివారం ఉదయం తలస్నానం చేసి శివుడికి నల్లటి నువ్వులను, నీటిని సమర్పించి ఓం నమశ్శివాయ అని జపించడం వల్ల శివుని అనుగ్రహం కలిగి శని ప్రభావం తొలగిపోతుంది. అదేవిధంగా శనివారం శివుడికి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

    Also Read: రథ సప్తమి అంటే ఏమిటి… రథసప్తమి విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..!

    శివుడికి శనివారం పూజ చేసే సమయంలో నల్లటి వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా నల్లటి వస్త్రాలను ఇతరులకు దానం చేసి, నల్లటి శునకానికి ఆహారం పెట్టడం వల్ల శని దోష నివారణ జరుగుతుంది. ఈ విధంగా 7 శనివారాలు పాటు శివుడికి పూజ చేయటం వల్ల శనీశ్వరుల అనుగ్రహం కలిగి, సకల సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా నీలిరంగు పుష్పాలతో పూజ చేయాలి. ఈ విధంగా శనీశ్వరుని పూజించిన శని అనుగ్రహం మనపై కలిగి శని దోష నివారణ జరుగుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం