https://oktelugu.com/

‘నాంది’ టాక్ అలా.. ‘అల్లరోడి’ ఫీలింగ్ ఇలా..

‘ఒక్క హిట్టు కావాలి.. అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి.. అపజయాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మరిన్ని అవకాశాలను అందుకునేందుకు ఒక్క హిట్టు కావాలి..’ అని అల్లరోడు మనసులో ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో. అవును మరి.. ఒకటా రెండా? దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా హిట్ అనే మాట చెవిన పడలేదు. ఇక కెరీర్ చివరకు చేరుకుందా? అనే మాట‌లు కూడా వినిపించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. విజ‌యాల‌కు ‘నాంది’ ప‌లికింది తాజా చిత్రం. Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం […]

Written By:
  • Rocky
  • , Updated On : February 20, 2021 / 02:20 PM IST
    Follow us on


    ‘ఒక్క హిట్టు కావాలి.. అర్జెంటుగా ఒక్క హిట్టు కావాలి.. అపజయాలకు అడ్డుకట్ట వేసేందుకు.. మరిన్ని అవకాశాలను అందుకునేందుకు ఒక్క హిట్టు కావాలి..’ అని అల్లరోడు మనసులో ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో. అవును మరి.. ఒకటా రెండా? దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా హిట్ అనే మాట చెవిన పడలేదు. ఇక కెరీర్ చివరకు చేరుకుందా? అనే మాట‌లు కూడా వినిపించాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. విజ‌యాల‌కు ‘నాంది’ ప‌లికింది తాజా చిత్రం.

    Also Read: ప‌వ‌ర్ స్టార్ కోసం.. భాగ్యన‌గ‌రం మ‌ళ్లీ నిర్మి‌స్తున్నారు!

    ‘అల్లరి’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన నరేష్.. అనతి కాలంలోనే సక్సెస్ ఫుల్ కామెడీ హీరోగా స్థిరపడ్డాడు. వేగంగా 50 సినిమాల మైలురాయిని కూడా రీచ్ అయ్యాడు. అయితే.. రాను రానూ తన సినిమాల్లో అసలైన కామెడీ తగ్గిపోయింది. కేవలం స్ఫూప్స్ తో నింపేస్తున్నారనే పరిస్థితి వచ్చేసింది. దాన్నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతో మందితో పనిచేశాడు. కానీ.. ఫెయిల్యూర్స్ కు మాత్రం అడ్డుకట్ట పడలేదు.

    ఇప్పటికీ అల్లరి నరేష్ హిట్ సినిమా ఏదంటే.. అప్పుడెప్పుడో వచ్చిన సుడిగాడు మాత్రమే చెబుతారు చాలా మంది. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నరేష్.. ఆ తర్వాత నరేష్ పేరెత్తితేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. రెండు వారాల ముందు విడుదలైన ‘బంగారు బుల్లోడు’ పాత రిజల్ట్ నే రిపీట్ చేసింది. అసలు ఆ సినిమా వచ్చిపోయింది కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైన ‘నాంది’మూవీకి అన్ని చోట్ల నుంచీ.. మంచి స్పంద‌నే ల‌భిస్తోంది.

    Also Read: ఓరి నాయనో.. బట్టలన్నీ విప్పేసిన పాయల్!

    సినిమాక‌న్నా ఎక్కువ‌గా న‌‌రేష్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. త‌న‌లోని మ‌రో కోణాన్ని బ‌య‌ట‌పెట్టాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అయితే.. సినిమాకు కావాల్సింది కేవ‌లం కితాబులు మాత్ర‌మే కాదు. అంత‌క‌న్నా ముఖ్యంగా క‌లెక్ష‌న్లు కావాలి. అయితే.. ఈ సినిమా విష‌యంలో క‌లెక్ష‌న్లు కూడా బాగానే ఉన్నాయి.

    థియేట‌ర్‌ రిలీజ్ కి ముందే ఈ సినిమా పెట్టుబ‌డి మొత్తం వచ్చేసింది. ఈ సినిమా డిజిట్ రైట్స్ ‘ఆహా’ దక్కించుకుంది. ఇక్కడే స‌గం పెట్టుబ‌డి వెనక్కి వ‌చ్చిన‌ట్టు సమాచారం. ఇక, శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అన్నీ క‌లుపుకుంటే నిర్మాత సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టేని తెలుస్తోంది. ఇప్పుడు థియేట‌ర్ ద్వారా వస్తున్న కలెక్షన్ మొత్తం బోన‌స్ అని సమాచారం. మొత్తానికి.. చాలా కాలం తర్వాత నరేష్ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి పరుగులు తీస్తోంది. దీంతో.. అల్లరోడు ఇన్నాళ్లకు ఖుషీగా ఉన్నాడట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్