Homeజాతీయ వార్తలుBJP Bandi Sanjay: ‘పాతబస్తీ’పై బీజేపీ వార్.. ఇరుకునపడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్?

BJP Bandi Sanjay: ‘పాతబస్తీ’పై బీజేపీ వార్.. ఇరుకునపడుతున్న ఎంఐఎం, టీఆర్ఎస్?

BJP Bandi Sanjay: కేంద్రంలో, రాష్ట్రాల్లో బీజేపీ తీరు తగ్గేదేలే అన్నట్టుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ బహిరంగంగానే సవాల్ చేస్తుంటారు. ఇక అక్కడే కాదు.. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నేతలది అదే దూకుడు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంఐఎంకు చోటు లేకుండా చేస్తున్నారు కమలం పార్టీ నేతలు.

BJP Bandi Sanjay
BJP, MIM

ఇక ఎంఐఎంనే ప్రత్యర్థిగా బహిరంగంగా పేర్కొంటూ నిప్పులు చెరుగుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఆటలు సాగనివ్వమంటూ తొడగొట్టేస్తున్నారు. ఎంఐఎంనే శత్రువుగా బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చేరాడు. నేరుగా ఎంఐఎం పార్టీకి వార్నింగ్ ఇచ్చాడు.

తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విద్యుత్ చార్జీలు, బస్సు చార్జీలు పెంచడంపై  బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న  కేసీఆర్.. ‘పాతబస్తీలో కరెంట్ బిల్లులు ఎందుకు వసూలు చేయడం లేదని నిలదీశారు. పాత బస్తీలో వెయ్యి కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.

Also Read: Raj Subramaniam New CEO Of FedEx: మ‌రో అంత‌ర్జాతీయ దిగ్గ‌జ కంపెనీకి సీఈవోగా ఇండియ‌న్ సంత‌తి వ్య‌క్తి..

యూపీలో అయినా.. మహారాష్ట్రలో అయినా బీజేపీ ప్రధాన టార్గెట్ ఎంఐఎం. కాంగ్రెస్ పని అయిపోవడంతో ఇప్పుడు హిందుత్వ ఓటు కోసం ఆ పార్టీపైనే పడుతున్నారు. ఇక ఎంఐఎం సానుభూతి ఓటర్లు ఎలాగూ బీజేపీకి వేయరు. అలా ఆ ఓటు పోయినా హిందుత్వ ఓటు గంపగుత్తగా పడేందుకు ఈ స్ట్రాటజీని అమలు చేస్తున్నారని అర్థమవుతోంది.

ఇప్పటికే 2023లో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీకి తెలంగాణలో గెలుపు అత్యవసరం. అందుకే వ్యూహాత్మకంగా పాతబస్తీ టార్గెట్ గా రాజకీయం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా తెలంగాణలో హిందుత్వ ఓటు బ్యాంకును ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ పాత బస్తీలో 1000 కోట్ల కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోవడాన్ని తెలంగాణ బీజేపీ అందిపుచ్చుకుంది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి టీఆర్ఎస్ ను, ఎంఐఎంను ఇరుకునపెట్టేందుకు రెడీ అవుతోంది. మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు తీసుకొస్తున్న ఈ కొత్త అస్త్రానికి ఎంఐఎం, టీఆర్ఎస్ ఎలా స్పందిస్తాయన్నది వేచిచూడాలి.

Also Read: Balkampet Yellamma Temple: బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి ఆ పేరెలా వ‌చ్చింది.. గుడి ప్రాముఖ్య‌త ఏంటో తెలుసా..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version