Taapsee Mishan Impossible: తాప్సీ ‘మిషన్..’కి నవీన్ పొలిశెట్టి మాట సాయం

Taapsee Mishan Impossible: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి టైమ్ నడుస్తోంది ప్రస్తుతం. ఫుల్ ఫాలోయింగ్ తో వరుస సినిమాలతో ఈ కుర్ర హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, నవీన్ పొలిశెట్టికి మొదటి హిట్ ఇచ్చిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాతోనే నవీన్ పొలిశెట్టి జాతకం మారింది. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా ? స్వరూప్ రాజ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వల్లే.. […]

Written By: Shiva, Updated On : March 29, 2022 4:13 pm
Follow us on

Taapsee Mishan Impossible: యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి టైమ్ నడుస్తోంది ప్రస్తుతం. ఫుల్ ఫాలోయింగ్ తో వరుస సినిమాలతో ఈ కుర్ర హీరో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, నవీన్ పొలిశెట్టికి మొదటి హిట్ ఇచ్చిన సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమాతోనే నవీన్ పొలిశెట్టి జాతకం మారింది. మరి ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా ? స్వరూప్ రాజ్. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వల్లే.. నవీన్ పొలిశెట్టి హీరోగా నిలబడ్డాడు.

Taapsee Mishan Impossible

అందుకే.. నవీన్ పొలిశెట్టి, స్వరూప్ రాజ్ కోసం డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు. నవీన్ పొలిశెట్టిని తన సినిమా కోసం రంగంలోకి దింపాడు దర్శకుడు స్వరూప్. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రాన్ని తీస్తున్నాడు. అందుకే.. నవీన్ పొలిశెట్టిని ఈ సినిమా కోసం రంగంలోకి దింపాడు స్వరూప్ రాజ్. ఈ చిత్రానికి నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు.

Also Read: Ghani Movie: ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్.. హైప్ వస్తుందా ?

నవీన్ పొలిశెట్టి డైలాగ్ చెప్పే శైలి బాగుంటుంది. మరి తన వాయిస్ ఓవర్‌ తో ఈ సినిమాకు నవీన్ ఏ రేంజ్ లో ప్లస్ అవుతాడో చూడాలి. కాగా, ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారం ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. ఎలాగూ టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను బాలీవుడ్ లో గుడ్ కాన్సెప్ట్‌ లతో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

కాబట్టి.. ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మార్కెట్ జరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే.. “ఆర్ఆర్ఆర్” విడుదలైన వారం రోజులకే ‘మిషన్ ఇంపాజిబుల్’ థియేటర్లలోకి వస్తే.. ఎవరు చూస్తారు ? అదేమిటో గానీ, తమ సినిమాను “ఆర్ఆర్ఆర్” సినిమా మింగేస్తుందేమో అన్న భయం కూడా ఈ సినిమా మేకర్స్ లో లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Taapsee Mishan Impossible

ఎంతైనా మిష‌న్ ఇంపాజిబుల్‌` చిన్న చిత్రమే అయినా.. సినిమాలో కంటెంట్ పరంగా గొప్ప సినిమా అని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే.. ‘మిష‌న్ ఇంపాజిబుల్‌` రిలీజ్ విషయంలో టీమ్ అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. తెలుగు ఇండస్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌ గా చేస్తుంటే.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Tollywood Trends: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Recommended Video:

Tags