BJP Vs Speaker: తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుండటం ఆపార్టీకి కంటగింపుగా మారుతోంది. వరుస ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ చెక్ పెడుతుండటంతో ఆపార్టీని నేరుగా ఎదుర్కోలేక దొడ్డిదారిన దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం పూనుకుంది. గవర్నర్ ను బీజేపీ నేతగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించడం సైతం పలు విమర్శలకు తావిచ్చింది.
అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 తేది నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పొడియం వద్దకు బీజేపీ నేతలు దూసుకొచ్చారని, బడ్జెట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏకంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు వారిపై వేటు వేయడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనంగా మారిందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
Also Read: Pawan Kalyan Target 2024: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!
ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ ఎండగడుతుందోనని స్పీకర్ వారిపై వేయడం సరైంది కాదని ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి. స్పీకర్ తమపై సస్పెన్షన్ వేటు వేయడంపై బీజేపీ ఎమ్మల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రెడ్డిలను కోర్టును హైకోర్టును సైతం ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాలు నేడు చివరి రోజు కావడంతో స్పీకర్ బీజేపీ నేతల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
హైకోర్టు సూచనల మేరకు ఈరోజు శాసన సభ ప్రారంభానికి ముందే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. హైకోర్టు ఆర్డర్ కాపీతో అసెంబ్లీ సెక్రటరీతో సమావేశమయ్యారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. అయితే నిన్న కూడా అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ విచారణ నిమిత్తం నోటిసులిచ్చింది. వీటిని అసెంబ్లీ కార్యదర్శి తీసుకోకపోవడంపై సీరియస్ అయింది. అసెంబ్లీ కార్యదర్శకి నోటీసులు చేరేలా చూడాలని రిజిస్ట్రార్ జనరల్, హైదరాబాద్ సీపీ స్వయంగా చూడాలని ఆదేశించింది. దీని తదుపరి విచారణ నేడు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.
మరోవైపు కోర్టులకు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్ అక్తర్ ఏకీభవించారు. సభా కార్యక్రమాలకు సభ్యులు ఎవరైనా ఆటంకం కల్పిస్తే సస్పెండ్ చేసే అధికారం స్పీకర్‌కు ఉందని విన్నవించారు. అయితే స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సభలో ప్రజాప్రతినిధులు వుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.