BJP leaders who will be fed up with Telangana flavors: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప సభ నేటి సాయంత్రం జరుగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభ, తెలంగాణలో పార్టీ బలోపేతం దృష్ట్యా అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం రెండ్రోజులపాటు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయనతోపాటు బీజేపీ జాతీయ నేతలు హాజరవుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో హైదరాబాద్ మొత్తం కషాయరంగును పులుముకుంది.

- అదిరిపోయేలా తెలంగాణ ఘుమఘుమలు..
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగున్న నేపథ్యంలో స్థానిక నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి వచ్చిన వారందరికీ తెలంగాణ రుచులను చూపించేలా అన్ని వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని గౌరవెల్లి గూడాటిపల్లెకు చెందిన యాదమ్మ చేతి వంటకాలను బీజేపీ పెద్దలకు ప్రత్యేకంగా వడ్డించనున్నారు.
- 50 రకాలతో ప్రత్యేక మోనూ..
తెలంగాణ స్టయిల్లో భోజనం, స్నాక్స్ తయారు చేయడంతోపాటు స్వీట్లను సైతం అందించనుండటం విశేషం. అతిరథ మహారథులను కోసం 50రకాల మోనూతో ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటిని యాదమ్మే స్వయంగా చేస్తున్నారట.
- కూరల విషయకొస్తే..
చిక్కుడుకాయ టమోట
గంగవాయిలకూర మామిడికాయ పప్పు
దొండకాయ పచ్చికొబ్బరి తురుము ఫ్రై
బెండకాయ జీడిపప్పు పల్లీల ఫ్రై
ఆలు కూర్మ
వంకాయ మసాలా
తోటకూర టమోట ఫ్రై
బీరకాయ మిల్ మేకర్ చూర ఫ్రై
మెంతికూర పెసరపప్పు ఫ్రై
బగార
పులిహోర
పుదీన రైస్
వైట్ రైస్
పెరుగన్నం
సాంబారు
ముద్దపప్పు
పచ్చిపులుసు
గోంగూర పచ్చడి
దోసకాయ ఆవ చట్నీ
టమోట చట్నీ
సోరకాయ చట్నీ
స్వీట్స్ విషయానికొస్తే..
బెల్లం పరమాన్నం
బొబ్బట్లు(భక్షాలు)
బూరెలు
అరిసెలు
సేమియా పాయసం
- స్నాక్స్ విషయానికొస్తే..
సర్వపిండి
సకినాలు
మక్క గుడాలు
పెసరపప్పు గారెలు
టమోట చట్నీ
పల్లీ చట్నీ
మిర్చి
పచ్చి కొబ్బరి చట్నీ వంటి వంటకాలను తెలంగాణ స్టయిల్లో ప్రత్యేకంగా స్థానిక బీజేపీ నేతలు తయారు చేయించారు. వీటిని ఈరోజు విజయ సంకల్ప ముగింపు సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు, హాజరైన ముఖ్య నేతలందరికీ ప్రత్యేకంగా వడ్డించనున్నారు.