BJP List : 52మందితో BJP తొలి జాబితా విడుదల, కేసీఆర్‌పై ఈటెల పోటీ

తెలంగాణ బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదలైంది. రెండు రోజులుగా ఢిల్లీలో మేధోమదనం చేసిన బీజేపీ ఎన్నికల కమిటీ 52 మందితో లిస్ట్ ప్రకటించింది.

Written By: NARESH, Updated On : October 22, 2023 1:12 pm
Follow us on

BJP List : అనుకున్నట్టే అయ్యింది.. ఏకంగా బీజేపీ కేసీఆర్ ను ఓడించాలని స్కెచ్ గీసింది. తన కేబినెట్ నుంచి గెంటేసిన సహచరుడినే కేసీఆర్ పై పోటీకి దింపింది. పగతో రగిలిపోతున్న ఈటలను ప్రతీకారానికి పురిగొల్పింది. దీంతో తెలంగాణలో మూడోసారి ముచ్చటగా గెలవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు.. అందునా ఆ పార్టీ అధినేతకు ఇది గట్టి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

అందరూ ఊహించినట్టే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన మాజీ సహచరుడు.. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పోటీకి సై అన్నారు. ఇదివరకే ప్రకటించినట్టు ఈటలను ఏకంగా కేసీఆర్ పై బరిలోకి దించి షాకిచ్చింది బీజేపీ. తనను బీఆర్ఎస్ నుంచి మంత్రి పదవి తొలగించి మరీ బయటకు పంపిన కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడిస్తానని గతంలోనే ఈటల శపథం పట్టాడు. అన్నట్టుగానే ఆ పంతం నెరవేర్చాడు.

తాజాగా తెలంగాణ బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా విడుదలైంది. రెండు రోజులుగా ఢిల్లీలో మేధోమదనం చేసిన బీజేపీ ఎన్నికల కమిటీ 52 మందితో లిస్ట్ ప్రకటించింది. కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. దీంతో ఈసారి ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారనుంది. అలాగే హుజూరాబాద్ నుంచి కూడా ఈటల బరిలోకి దిగుతున్నారు.