BiggBoss 6 Telugu: బుల్లితెరపై ఊర్రూతలూగించిన ‘బిగ్ బాస్’ షో అశేష ప్రేక్షకాదరణ పొందింది. అప్పటి వరకు కేవలం టీవీల్లో మూస సీరియళ్లు చూసిన జనాలకు ఈ రియాలీటీ షో కట్టిపడేసింది. ఈ షో ఎంట్రీ ఇచ్చాక ‘బిగ్ బాస్’కు జనాలు ఫ్యాన్స్ గా మారిపోయారు. దినదినం ఉత్కంఠగా సాగే ఈ షో ఇప్పటికే 5 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 6వ సీజన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 5 షోలు పూర్తి చేసుకున్న తరువాత బిగ్ బాస్.. ఓటీటీ ద్వారా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరుతో 24 గంటల షో ప్రసారం చేశారు. అయితే దానికి ఆశించినంత ప్రేక్షకాదరణ దక్కలేదు. దీంతో ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ రియాలిటీకి రంగం సిద్ధమైంది. 6వ ఎపిసోడ్ లో నటించే కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

వివిధ రంగాల్లో సెలబ్రెటీలతోపాటు సినీ నటులను ఇప్పటి వరకు బిగ్ బాస్ షో లో తీసుకున్నారు. ఆ తరువాత టీవీ నటులు, యూట్యూబ్ స్టార్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు కామన్ మ్యాన్ కు కూడా అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా కామన్ మ్యాన్ ఉండనున్నారన్నది టాక్. దీనికి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో వేచిచూడాలి. కామన్ మ్యాన్ తో పాటు మరికొంత మంది సెలబ్రెటీలను ఇప్పటికే బిగ్ బాస్ టీం సంప్రదించినట్లు సమాచారం. కొందరి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
ఈసారి బిగ్ బాస్ లో హైపర్ ఆది, యాంకర్ వర్షిణి, నటి నవ్యాస్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రా రాయ్ లను బిగ్ బాస్ 6 కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. వీరిలో ఇదివరకు ఏ ఒక్కరు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. మొన్నటి వరకు ఓటీటీ వేదికగా సాగిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో అల్రేడీ హౌస్ లోకి వచ్చిన వారిని కూడా మళ్లీ తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు 6వ సీజన్ కోసం కొత్తవారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు టీవీ నటులకు ప్రాధాన్యతనిచ్చిన మేనేజ్మెంట్ త్వరలో మరికొంత మంది సెలబ్రెటీలను తీసుకునే అవకాశం ఉంది. వారిలో యూట్యూబ్ స్టార్లు ఉంటారా..? లేక సినీ నటులు ఉంటారా..? అనేది తేలాల్సి ఉంది.
ప్రతీ జూన్ నుంచి ఆగస్టులో కంటెస్టెంట్ల ఎంపిక సాగుతుంది. ఈ సారి కూడా ఈ నెలాఖరు వరకు హౌస్ లోకి వచ్చే వారిని ఎంపిక చేసి జూలై లేదా ఆగస్టులో షో మొదలుపెట్టనున్నారు. దీంతో బిగ్ బాస్ ప్రేమికులకు త్వరలోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందన్నమాట. ఇదిలా ఉండగా ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున ఉంటారా..? లేక కొత్తవారిని పెడుతారా..? అనేది ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్, నాని తరువాత కొత్త హోస్ట్ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం హోస్ట్ కొత్తవారు ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ మేజేన్మెంట్ మాత్రం నాగార్జునకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం.