Bigg Boss 7 Telugu : ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నా బిగ్ బాస్ కంటేస్టెంట్ ఎవరంటే..?

Bigg Boss 7 Telugu, Bigg Boss Elimination, Bigg Boss Eliminate, Tasty Teja, Movie News,

Written By: NARESH, Updated On : November 4, 2023 8:17 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బుల్లితెర మీద అత్యంత పెద్ద షో గా గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ గా సీజన్ 7 లోకి అడుగుపెట్టి ఇప్పుడు కూడా చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్న బిగ్ బాస్ షో రోజు రోజు కి రసవత్తరంగా మారుతుంది…ఇక ప్రతివారం ట్విస్ట్ లు ఊహించని టర్న్ లు జరుగుతూనే ఉన్నాయి.ఇక గత వారం బిగ్ బాస్ హౌస్ లో అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చెప్పుకునే సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందనే దాని మీద ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రాంగ్ కంటేస్టెంట్స్ గా చెప్పుకునే వాళ్ళందరూ ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోతున్నారు…

నిజానికి ఇప్పటికి కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే కంటేస్టెంట్స్ వాళ్లు ఆడుతున్న టాస్క్ లను బట్టి ఎలిమినేషన్ అనేది డిసైడ్ చేస్తారా లేదా వాళ్లకు వచ్చిన ఓటింగ్స్ ని బట్టి డిసైడ్ చేస్తారా అనే దానిపైన ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే టాస్క్ లు బాగా ఆడే వాళ్లని కూడా పూర్ ఓటింగ్స్ వచ్చాయనే కారణంతో ఎలిమినేట్ చేస్తున్నారు.కానీ కొంతమందిని మాత్రం వాళ్ళు టాస్క్ లు సరిగ్గా ఆడకపోయినా ఓటింగ్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ వాళ్లని ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకుంటూ రోజులు గడుపుకుంటూ వారిని ముందుకు తీసుకువస్తున్నారు దానివల్ల బిగ్ బాస్ షోకి చాలా వరకు హెల్ప్ అవుతుంది అనేది నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక బిగ్ బాస్ 7 లో ప్రతి వారం ఒక కంటేస్టెంట్ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇక 9వ వారం కూడా జరగబోతున్న నేపథ్యం లో ఇప్పటికే శోభా శెట్టి, రతిక రోజ్,అమర్ దీప్, భోలే షావలి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, అర్జున్, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. ఇక వీరిలో ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక విధంగా మంచి ఓట్లను రాబట్టి కొని అమర్ దీప్, యావర్, అర్జున్, భోలే లాంటి కంటేస్టెంట్స్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు గా అర్థం అవుతుంది.

అయితే టేస్టీ తేజ హౌజ్ లో చాలా ఆక్టివ్ గా ఉంటూ చాలా సరదా గా అందరిని నవ్విస్తూ, అప్పుడప్పుడు ఏడిపిస్తూ తనదైన రీతిలో టాస్క్ ల్లో పాల్గొంటూ మొత్తానికి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు…ఇక శోభా శెట్టి గురించి చెప్పాలి అంటే ఆమె కూడా ప్రతి టాస్క్ లో తన వాయిస్ వినిపిస్తూ ముందుకు సాగుతుంది అయితే వీళ్లిద్దరూ హౌజ్ లో చాలా బాగా అక్టివ్ గా ఉన్నప్పటికీ వీళ్ళకి జనాల నుంచి వచ్చే ఓటింగ్స్ మాత్రం చాలా తక్కువ గా ఉండటం తో ప్రతి వారం శోభా శెట్టి నామినేషన్ లోకి వస్తుంది.ఇక లాస్ట్ టైం కూడా చివరి వరకు వచ్చి సేఫ్ అయింది…

అయితే ఈసారి కూడా టేస్టీ తేజ, శోభా శెట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్ ప్రక్రియ ని ఎదుర్కొన బోతున్నారు అనే సమాచారం అయితే అందుతుంది.ఇక బిగ్ బాస్ లో గ్లామర్ హీట్ ని పెంచడానికి మొదటి నుంచి కూడా శోభా శెట్టి ని నిర్వాహకులు సేఫ్ చేసుకుంటూ వస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈసారి కూడా శోభా శెట్టి ని హౌజ్ లో కంటిన్యూ చేయడానికి టేస్టీ తేజ మీద వేటు పడబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వబోతున్నట్టు గా తెలుస్తుంది…