Bigg Boss 7 Telugu : ఉత్కంఠ మధ్య టేస్టీ తేజా ఎలిమినేషన్… 9 వారాలకు అతని రెమ్యునరేషన్ ఎంతంటే?

హౌస్లో తేజ మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. శోభకు తేజ బెస్ట్ ఫ్రెండ్. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఇతడు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు.

Written By: NARESH, Updated On : November 5, 2023 11:40 am
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ షోలో మరో ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. నేడు ఆదివారం నామినేషన్స్ లో ఉన్న ఒకరు ఇంటిని వీడనున్నారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కెప్టెన్ గౌతమ్, శివాజీ, ప్రశాంత్, అశ్విని నామినేషన్స్ లో లేరు. మిగిలిన అమర్ దీప్, యావర్, తేజా, శోభా, ప్రియాంక, భోలే, అర్జున్, రతిక నామినేట్ అయ్యారు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ మొదలైంది. యావర్, అమర్, భోలే ఓటింగ్ లో ముందున్నారని సమాచారం.

ప్రియాంక, శోభా అందరికంటే తక్కువ ఓట్లతో వెనుకబడ్డారని అనధికార నామినేషన్స్ ద్వారా తెలిసింది. సోషల్ మీడియాలో కూడా శోభా ఎలిమినేట్ కానుందని ప్రచారం జరిగింది. అనూహ్యంగా తేజ ఎలిమినేట్ అయినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యిందట. ఈ క్రమంలో శోభా కోసం తేజను బలి చేశారన్న వాదన మొదలైంది.

గత వారం కూడా శోభకు తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. కానీ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. స్టార్ మా యాజమాన్యం సీరియల్ బ్యాచ్ కి ఫేవర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులోనూ వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్లో ఉంది నలుగురే అమ్మాయిలు. వాళ్లలో శోభ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. ఈ కారణాలతో కూడా శోభ జోలికి పోవడం లేదట. ఆమెకు తక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేయడం లేదంటున్నారు.

ఇక యూట్యూబర్ హోదాలో తేజ హౌస్లో అడుగుపెట్టాడు. ఇతనికి పెద్దగా ఫేమ్ లేదు. ఈ క్రమంలో తేజ రెమ్యూనరేషన్ తక్కువే అని తెలుస్తుంది. వారానికి తేజకు రూ. 1.5 లక్ష ఇస్తున్నారట. 9 వారాలున్న తేజ రూ. 13.5 లక్షల వరకు తీసుకుంటున్నాడట. హౌస్లో తేజ మంచి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. శోభకు తేజ బెస్ట్ ఫ్రెండ్. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఇతడు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యాడు.