Bigg Boss 6 Telugu Episode 11 : బిగ్ బాస్ 10వ రోజు సిసింద్రీ డాల్ టాస్క్ నవ్వులు పూయించింది. చిన్న పిల్లల బొమ్మలను కంటెస్టెంట్లకు ఇచ్చి వాటిని కాపాడుకోవాలని కంటెస్టెంట్లకు సూచించాడు బిగ్ బాస్. ఈక్రమంలోనే అందరికంటే గీతూ చలాకీగా ఆడింది. కంటెస్టెంట్లు అందరూ నిద్రపోయిన తర్వాత తను మేల్కొండి అందరి డాల్స్ కొట్టేయడానికి ట్రై చేసింది. శ్రీహాన్, సహా కొందరి డాల్స్ ను తస్కరించి గీతూ వారిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించేసింది.

ఇక తన బొమ్మ పోయిన బాధలో శ్రీహాన్ , అర్జున్ లు మిగతా ఇంటి సభ్యుల బొమ్మలను తస్కరించి వారిని కెప్టెన్సీ రేసులోంచి ఎలిమినేట్ చేశారు.
ఇక తన బొమ్మను ఎవరైనా కొట్టేస్తారని భయపడిన గీతూ చాలా తెలివిగా ఆలోచించింది. తన బొమ్మల డ్రెస్ ను తీసేసి తెలివిగా బ్యాగ్ లో పెట్టేసుకుంది. ఒట్టి డ్రెస్ లేని బొమ్మను స్టోర్ రూంలో పెట్టేసింది. ఆ డ్రెస్ లేని బొమ్మను చూసిన రేవంత్ దాన్ని ఎలిమినేట్ జోన్ లో పెట్టేశాడు. కానీ గీతూ మాత్రం తన బొమ్మకు వేసిన బట్టలను తీసుకొని వేరే బొమ్మకు తొడిగి ఇదే తన బొమ్మ అని.. ఎలిమినేట్ కాలేదంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇంట్లోని అందరికంటే గీతూ ఆడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కింగ్ ఆఫ్ రింగ్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ అందులో గెలిచిన వారిని కెప్టెన్సీ రేసులోకి చేరుకుంటారని టాస్క్ ఇచ్చాడు. రింగ్ లోకి మొదట నలుగురు ఆడవాళ్లు వచ్చారు. ఇందులోకి 5వ కంటెస్టెంట్ గా అర్జున్ అనే మగ కంటెస్టెంట్ రావడంతో అతడిని అందరు మహిళలు కలిసి రింగ్ లోంచి బయటకు తోసేసి ఎలిమినేట్ చేశారు. మేల్ కంటెస్టెంట్ ను లేడీ కంటెస్టెంట్లు అంతా తోసేసి తమ ఐక్యత చాటుకోవడం విశేషం.
రింగులో ఫైమా, ఆరోహి, కీర్తి, ఇనాయా సుల్తానా పోటీపడ్డారు. ఇందెలో మొదట ఫైమా, ఆ తర్వాత ఆరోహి ఎలిమినేట్ అయిపోయారు. ఇక చివరిలో కీర్తి, ఇనాయలు రింగ్ లో పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో ఇనాయా తోసేయడంతో కీర్తి తీవ్రంగా గాయపడింది. దీంతో ఈ కింగ్ ఆఫ్ రింగ్ టాస్క్ లో ఇనాయా విజేతగా నిలిచింది.
ఇక తనను అన్యాయంగా రింగ్ టాస్క్ లోంచి ఎలిమినేట్ చేశాడని ఫైమా ఏడ్చేసింది. రేవంత్ గత టాస్క్ లో చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నాడని బాధపడింది. ఫైమా ఏడుస్తుంటే కీర్తి ఓదార్చింది.
బిగ్ బాస్ హౌస్ లో పట్టపగలు పడుకోవడంతో చలాకీ చంటి, ఫైమా, రేవంత్ లను చూసి కుక్కలు మొరిగాయి. దీంతో కెప్టెన్ వారికి బాత్రూంలు కడగాలని పనిష్ మెంట్ వేస్తాడు.
కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఐస్ క్రీం ఛాలెంజ్ పేరిట మరో టాస్క్ ఇచ్చాడు. ఐస్ క్రీమ్ లను సరిగ్గా పెట్టాలని సూచించాడు. ఇందులో తొలి రౌండ్ లో రాజ్ విజేతగా నిలిచాడు. రెండో రౌండ్ లో సూర్య విజేతగా నిలిచాడు.
ఇక చివరలో సిసింద్రీ టాస్క్ పూర్తయినట్టు బిగ్ బాస్ తెలిపారు. నాలుగు దశల్లో నిర్వహించిన కెప్టెన్సీ టాస్కుల్లో చలాకీ చంటి, ఇనాయా, రాజ్, సూర్యలు గెలిచారని.. ఈ నలుగురిని కెప్టెన్సీ టాస్కుకు పోటీపడుతున్నట్టు ప్రకటించారు.
మొత్తంగా సిసింద్రీ టాస్క్ పేరిట కంటెస్టెంట్లతో బొమ్మలను దొంగిలించడాలు, కిడ్నాప్ లు చేయించడాలు, కుస్తీ పోటీలతో దాడుల వరకూ ఈరోజు సాగింది. ఆద్యంతం ఆసక్తి రేపేలా ఈ బొమ్మల టాస్క్ అలరించింది.