Karpoori Thakur : కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం హర్షనీయం. అట్టడుగు వర్గం నుంచి వచ్చి నిజాయితీగా.. నిస్వార్థంగా సమాజ సేవ చేసిన వ్యక్తి. సామాజిక న్యాయానికి నిజమైన ప్రతిబింబం కర్పూరీ ఠాకూర్. ఆయన శతజయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ‘కర్పూరీ ఠాకూర్’కు భారత రత్న ఇవ్వడం నిజంగా మోడీ మార్క్ రాజకీయమే..
మోడీ రాకముందు ఒకసారి పద్మ అవార్డులు చూసుకోండి.. మోడీ వచ్చిన తర్వాత పద్మ అవార్డులు తీసుకోండి.. సామాన్యులకు పద్మ అవార్డులు రావడం అనేది మోడీ హయాంలోనే జరిగింది.
సరిగ్గా గణతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందుగానే రాష్ట్రపతి భవన్ భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బీహార్ రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రీ
కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారం అందిస్తున్నట్టు వివరించింది. ఇంతకీ ఎవరు ఈ కర్పూరీ ఠాకూర్? రాష్ట్రపతి భవన్ ఆయనకు ఎందుకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ను ప్రకటించింది? బీహార్లో కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా అయినటువంటి కర్పూరీ ఠాకూర్ కార్యక్రమాలు చేపట్టారు? అక్కడి ప్రజల్లో ఎటువంటి ముద్ర వేయగలిగారు? అకస్మాత్తుగా ఆయనపై రాష్ట్రపతి భవన్ కు ఎందుకు ప్రేమ కలిగింది? భారతరత్న పురస్కారం అందించే వైపు ఎందుకు అడుగులు వేయించింది? ఈ వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇది కర్పూరీ ఠాకూర్ జయంతి సంవత్సరం. 19 24 లో బీహార్ లో జన్మించారు. 1988లో కన్నుమూశారు. తాను జన్మించిన బీహార్ లోనే కాదు మొత్తం ఉత్తరాది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించారు. అందుకే అక్కడి ప్రజలు ఆయనను జన్ నాయక్ అని పిలుస్తారు.. 1924 జనవరి 24న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలోని పితోంజియా గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరీ ఠాకూర్ జన్మించారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరారు. 1942 నుంచి 1945 మధ్యలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో వేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో పనిచేశారు. 1952లో సోషలిస్ట్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆస్ట్రియాకు బీహార్ నుంచి ఒక ప్రతినిధి బృందం వెళ్లగా.. ఇందులో కర్పూరీ ఠాకూర్ కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఎందుకు కోటు కావలసి ఉండటం.. అది ఆయన దగ్గర లేకపోవడంతో స్నేహితుడి వద్ద అడిగి తీసుకెళ్లారు. అయితే ఆ కోటు చినిగి ఉన్నప్పటికీ.. అలాగే తీసుకెళ్లారు. ఆ కోటు చూసిన యుగోస్లోవియా అధినేత మార్షల్ టిటో ఆయనకు కొత్త కోటు అందించారు..
కర్పూరీ ఠాకూర్ తరలించి అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపేవారు. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. చివరికి ఆయనకు సొంత కారు, ఇంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదు. చివరికి సరైన దుస్తులు కూడా ఆయనకు ఉండేవి కావు. రాజకీయంగా కర్పూరీ ఠాకూర్ అంచలంచెలుగా ఎదిగారు.
అత్యంత వెనకబడిన వర్గాల నాయకుడు కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడం గొప్ప నిర్ణయం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..