IND vs ENG : ధోని కంటే వేగవంతమైన వికెట్ కీపర్ ఉన్నాడా?

అతడు వచ్చిన అవకాశాన్ని కూడా అసలు వదులుకోడు. క్షణాల్లోనే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. కేవలం కీపింగ్ మాత్రమే కాదు బ్యాటర్ గానూ అతడు మెరుపులు మెరిపిస్తున్నాడు" అంటూ అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు.

Written By: NARESH, Updated On : February 12, 2024 4:12 pm
Follow us on

Bihar Politics : అతడిది గాలి ని మించిన వేగం. ధ్వని వేగాన్ని మించిన చురుకుదనం.. చిరుత లాంటి చూపులతో వికెట్లను గిరాటేస్తాడు. వెంట్రుకవాసిలో బంతులను అందుకుంటాడు. కలయా నిజమా అనుకునే లోగానే బ్యాట్స్ మెన్ ను అవుట్ చేస్తాడు. నీళ్లు తాగినంత ఈజీగా రన్ అవుట్ చేస్తాడు. వికెట్ల వెనుక గోడలాగా నిలబడి స్టంప్ అవుట్ చేస్తాడు. మహేంద్ర ధోని పేరు ప్రస్తావనకు వస్తే పై విషయాలే మదిలో మెదులుతాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఉత్తమ కీపర్ ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు కచ్చితంగా మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడు. అలాంటి వికెట్ కీపర్ గా, విజయవంతమైన కెప్టెన్ గా భారతీయ అభిమానుల్లోనే కాదు.. ప్రపంచ క్రికెట్ అభిమానుల్లోనూ ధోని సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ధోని లాంటి గొప్ప వికెట్ కీపర్ లేడని ఆడం గిల్ క్రిస్ట్ లాంటివాళ్ళు చెబుతుంటే.. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు అలెక్ స్టివార్ట్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ” వికెట్ల వెనుక ధోని అత్యంత వేగంగా పరిగెత్తుతాడు. అతడు ఎంతో చురుకైనవాడు. కానీ మా బెన్ ఫోక్స్ అతనికంటే మెరుగు” అని స్టెవార్ట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

“ధోని కీపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడి వ్యూహ చతురత చాలా బాగుంటుంది. కానీ ఫోక్స్ చేతిలో వేగం సెకన్లలోపే ఉంటుంది. అతడికి ఆ నైపుణ్యం సహజ సిద్ధంగా వచ్చింది. నేను సర్రే క్రికెట్ క్లబ్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో ఫోక్స్ ను దగ్గరగా గమనించాను. అతడు వచ్చిన అవకాశాన్ని కూడా అసలు వదులుకోడు. క్షణాల్లోనే బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. కేవలం కీపింగ్ మాత్రమే కాదు బ్యాటర్ గానూ అతడు మెరుపులు మెరిపిస్తున్నాడు” అంటూ అలెక్ స్టివార్ట్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు భారత్లో పర్యటిస్తోంది. తొలి టెస్ట్ ఇంగ్లాండ్ గెలుచుకోగా.. రెండవ టెస్టును భారత్ గెలిచింది.. ఇక ఫోక్స్ ఇప్పటివరకు 22 టెస్ట్ మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. కీపర్ గా రాణించాడు. 22 క్యాచ్లు పట్టాడు. 8 స్టంప్ ఔట్లు చేశాడు. 30.72 సగటుతో 1,014 చేశాడు. వైజాగ్ టెస్ట్ మ్యాచ్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ పరుగుల ద్వారా ఈ ఫీట్ సాధించిన 12వ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు.

ఇక మహేంద్ర ధోని వయసు ప్రస్తుతం 41 సంవత్సరాలు. ఇప్పటికీ కూడా అదే ఫిట్నెస్ తో వికెట్ కీపర్ రాణిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ గిల్ ను రెప్పపాటు కాలంలో స్టంప్ అవుట్ చేసి అందరిని ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఇక ధోని తన టెస్ట్ కెరియర్ లో 256 క్యాచ్లు పట్టాడు. 38 స్టంపు ఔట్లు చేశాడు. గుండెల్లో 123 స్టంప్ ఔట్లు చేశాడు. 321 క్యాచ్ లు పట్టాడు. టి20 ల్లోనూ 57 క్యాచ్ లు, 34 స్టంప్ ఔట్లు చేశాడు. కాగా, మహేంద్ర సింగ్ ధోనీ పై అలెక్ స్టివార్ట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “మహేంద్ర సింగ్ ధోని ని మించిన వికెట్ కీపర్ ఎవరూ లేరు. అలెక్ స్టివార్ట్ ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాడు. కానీ అది విశ్వాసమని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.