
జీవితంలో మనం ఎంత కష్టపడినా అదృష్టానికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంటుంది. అదృష్టం ఉన్నవాళ్లకు ఎలాంటి కష్టాలైనా నిమిషాల్లో తీరిపోతాయి. అందుకు ఫ్రెంచ్ లోని యాచకులే సాక్ష్యం. ఫ్రెంచ్ లో నలుగురు యాచకులు రోజూ అడుక్కుని డబ్బు సంపాదించేవారు. ఆ సంపాదనతోనే తమతో పాటు కుటుంబాన్ని పోషించేవారు. యాచించడం ద్వారా వచ్చిన డబ్బు వాళ్ల ఖర్చులకే సరిపోయేది కాదు.
అయితే ఒకరోజు మాత్రం ఆ యాచకులను అనుకోని అదృష్టం తలుపుతట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 59 వేల యూరోలు(43 లక్షల రూపాయలు) సొంతమైంది.ఏ మాత్రం కష్టపడకుండానే అంత మొత్తంలో డబ్బు సొంతం కావడంతో వాళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఒక అజ్ఞాతవ్యక్తి వాళ్లు పెద్దమొత్తంలో డబ్బులను పొందడానికి కారణమయ్యాడు. ఒక అజ్ఞాత వ్యక్తికి తన దగ్గర డబ్బులు ఉన్నా ఎందుకో దానం చేయడానికి మనసొప్పలేదు.
నలుగురు యాచకులకు డబ్బులకు బదులు ఆ అజ్ఞాతవ్యక్తి స్క్రాచ్ కార్డును ఇచ్చాడు. ఆ స్క్రాచ్ కార్డును గీకిన బిచ్చగాళ్లకు కళ్లు బైర్లు గమ్మాయి. అజ్ఞాత వ్యక్తి ఒక యూరో ఖర్చు చేసి బిచ్చగాళ్లకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టాడు. ఆ స్క్రాచ్ కార్డుకు లాటరీ తగులుతుందని బహుషా ఆ అజ్ఞాతవ్యక్తి కూడా ఊహించి ఉండడు. ఏకంగా 43 లక్షల రూపాయలు సొంతం కావడంతో బిచ్చగాళ్ల జీవితమే మారిపోయింది.
బిచ్చగాళ్లు లాటరీ ద్వారా పొందిన డబ్బును సమంగా పంచుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బిచ్చగాళ్లు లక్షాధికారులకు కావడానికి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనుకోకుండా వచ్చిన అదృష్టాన్ని తలుచుకుంటూ ఆ యాచకులు ఇకపై యాచక వృత్తిని వదిలి మంచిగా జీవనం సాగించాలని నిర్ణయం తీసుకున్నారు.