హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లోని , సికింద్రాబాద్, హబ్సిగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట, టోలిచౌకితో పాటు ఎస్సార్ నగర్, ముషీరాబాద్ , చిక్కడపల్లి, రాంనగర్, అబిడ్స్, అఫ్జల్‌గంజ్, కోఠి, రాజేంద్ర నగర్, నార్సింగి, మణికొండ, అంబర్‌పేట, నల్లకుంట, నాచారం, మల్కాజ్‌గిరి, ఉప్పల్ లో భారీ వాన కురుస్తోంది.