BCCI Central Contract : యువ క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ.. లిస్ట్ లో కీలక ప్లేయర్లు వీరే

ఇక సీనియర్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, గిల్ ఏ కేటగిరిలో అవకాశం దక్కించుకున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ కేటగిరీలో స్థానం సంపాదించుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 28, 2024 9:15 pm
Follow us on

BCCI Central Contract :  బీసీసీఐ చెప్పినట్టే చేసింది. తమ ముందు తోకాడిస్తున్న క్రికెటర్లను తోకలను కట్ చేసింది. రంజీ ఆడాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యువ క్రికెటర్లకు గుణపాఠం చెప్పింది. ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అకస్మాత్తుగా తొలగించింది. 2023-2024 సీజన్ కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు జాబితాలో యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పేర్లు మాయమయ్యాయి. అయితే వీరు రంజీ ఆడకుండా, చెప్పినట్టు చేయకుండా, టీ – 20 లు ఆడేందుకు మాత్రమే ఆసక్తి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వారిని పక్కన పెట్టింది. ఇక బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టు 2023, అక్టోబర్ 1 నుంచి 2024, సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా ఏ+ కేటగిరిలో తమ స్థానాలను మరోసారి పదిలం చేసుకున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో వరుస డబుల్ సెంచరీలు, హాఫ్ సెంచరీ చేసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఏకంగా బీ కేటగిరిలో స్థానం సంపాదించుకున్నాడు. ఇక సీనియర్ క్రికెటర్లు కేఎల్ రాహుల్, గిల్ ఏ కేటగిరిలో అవకాశం దక్కించుకున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ కేటగిరీలో స్థానం సంపాదించుకున్నాడు.

సెంట్రల్ కాంట్రాక్ట్ వివరాలివే..

ఏ+ కేటగిరి: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, బుమ్రా.

ఏ కేటగిరి: రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సిరాజ్.

బీ కేటగిరీ: సూర్య కుమార్ యాదవ్, కులదీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్.

సీ కేటగిరీ: రజత్ పాటిదర్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, కేఎస్ భరత్, అర్ష్ దీప్ సింగ్, సంజూ శాంసన్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, రుత్ రాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే.