Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు భాషల్లో సక్సెస్ అయిన ఈ రియాలిటీ షో, తెలుగులో సైతం సత్తా చాటుతుంది. 2017లో మొదలైన బిగ్ బాస్ తెలుగు ఇప్పటి వరకు 8 సీజన్స్ పూర్తి చేసుకుంది. లేటెస్ట్ సీజన్ డిసెంబర్ 15న ముగిసింది. కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ టైటిల్ విన్నర్ అయ్యాడు. గౌతమ్ రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకున్నాడు. నబీల్, ప్రేరణ, అవినాష్ వరుసగా తర్వాత స్థానాల్లో నిలిచారు.
సీజన్ 8 పర్లేదు అనిపించుకుంది. చెప్పుకోదగ్గ సెలెబ్స్ లేకపోవడంతో పాటు, గేమ్స్, టాస్క్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ఐతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అనంతరం షో ఒకింత రసవత్తరంగా మారింది. మాజీ కంటెస్టెంట్స్ అవినాష్, రోహిణి, హరితేజ, గౌతమ్, గంగవ్వ, నయని పావని, మెహబూబ్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లో అడుగుపెట్టారు. అవినాష్, గౌతమ్ మాత్రమే ఫైనల్ కి వెళ్లారు. గౌతమ్ టైటిల్ రేసులో నిలబడ్డాడు.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 9కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. సాధారణంగా ఆగస్టు తర్వాత బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. సీజన్ 8 సెప్టెంబర్ లో మొదలైంది. కానీ ఈసారి 2025 ప్రథమార్థంలోనే బిగ్ బాస్ షో ప్రసారం చేయనున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయట. సమ్మర్ నుండి షో మొదలయ్యే అవకాశం కలదట. ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తే… విద్యాసంస్థలకు సెలవులు కూడా కాబట్టి ఆదరణ లభించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట.
ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అదే జరిగితే బిగ్ బాస్ లవర్స్ ఆనందానికి అవధులు ఉండవు. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సత్తా చాటుతున్నాడు. సీజన్ 3 నుండి ఆయన కొనసాగుతున్నారు. సక్సెస్ఫుల్ గల ఆరు సీజన్స్ కి హోస్టింగ్ బాధ్యతలు నెరవేర్చారు. ఈ క్రమంలో విమర్శలు ఎదురైనా ఆయన పట్టించుకోవడం లేదు. బిగ్ బాస్ షోపై ఒక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ షో భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అనే వాదన ఉంది. సిపిఐ నారాయణ పలు సందర్భాల్లో నాగార్జునపై విమర్శలు గుప్పించారు.
Web Title: Is bigg boss telugu 9 coming shocking details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com