Pelli Pustakam Movie : అప్పటి ముచ్చట్లు: మిస్సమ్మను తిరగేస్తే పెళ్లి పుస్తకం అయ్యింది… బాపు-రమణల ఐడియా బ్లాక్ బస్టర్!

ఈ చిత్రానికి కథను నటుడు రావి కొండలరావు అందించడం విశేషం. నిర్మాత వెంకటరమణ 1957లో వచ్చిన మిస్సమ్మ కథ స్ఫూర్తితో కథను సిద్ధం చేయాలనే ప్రతిపాదన బాపు, రావి కొండలరావు ముందు పెట్టారట. దీంతో మిస్సమ్మ కథలోని హీరో హీరోల పాత్రల నేపథ్యం రివర్స్ చేసి కథ అల్లుకున్నారు.

Written By: NARESH, Updated On : July 16, 2023 8:07 pm
Follow us on

Pelli Pustakam Movie : దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కాంబోలో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో పెళ్లి పుస్తకం ఒకటి. 1991లో విడుదలైన పెళ్లి పుస్తకం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటి. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ ప్రధాన అంశాలుగా పెళ్లి పుస్తకం తెరకెక్కింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాపు పెళ్లి పుస్తకం మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. బాపు, రమణల పేర్లు మరోసారి మారుమ్రోగాయి. రమణ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఆయన నిర్మాత కూడాను.

మాస్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తున్న రోజుల్లో క్లాస్ మూవీ పెళ్లి పుస్తకం బాక్సాఫీస్ వద్ద అద్భుతం చేసింది. కాసుల వర్షం కురిపించింది. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేని పెళ్లి పుస్తకం చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం అందుకుంది. భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు ఆద్యంతం అలరిస్తాయి. ఒకరిపై మరొకరికి ప్రేమ వలన కలిగే అసహనం, కోపం చాలా రొమాంటిక్ గా చూపించారు. కేవీ మహదేవన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘శ్రీరస్తు శుభమస్తు’ సాంగ్ ఆల్ టైం హిట్. జనరేషన్స్ తో సంబంధం లేకుండా ప్రతి పెళ్లి వేడుకలో ఈ పాట వినిపిస్తుంది.

ఈ చిత్రానికి కథను నటుడు రావి కొండలరావు అందించడం విశేషం. నిర్మాత వెంకటరమణ 1957లో వచ్చిన మిస్సమ్మ కథ స్ఫూర్తితో కథను సిద్ధం చేయాలనే ప్రతిపాదన బాపు, రావి కొండలరావు ముందు పెట్టారట. దీంతో మిస్సమ్మ కథలోని హీరో హీరోల పాత్రల నేపథ్యం రివర్స్ చేసి కథ అల్లుకున్నారు. అంటే మిస్సమ్మ మూవీలో ఎన్టీఆర్-సావిత్రి ఉద్యోగం కోసం మొగుడు పెళ్ళాంగా నటిస్తారు. ఇక్కడ పెళ్ళైన రాజేంద్ర ప్రసాద్-దివ్యవాణి ఓకే ఆఫీస్ లో పరిచయం లేని వాళ్ళుగా నటిస్తారు.

మిస్సమ్మ-పెళ్లి పుస్తకం చిత్రాల పాత్రలకు చాలా పోలికలు ఉంటాయి. ఎస్వీ రంగారావు పాత్ర గుమ్మడి చేసిన పాత్రను పోలి ఉంటుంది. మిస్సమ్మలో ఎస్వీ రంగారావు కూతురుగా జమున చేసింది. ఆ తరహా పాత్రను పెళ్లి పుస్తకంలో సింధుజ చేసింది. అక్కడ ఎన్టీఆర్ కి జమున దగ్గరైతే సావిత్రి తట్టుకోలేదు. ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమను ఇగో చాటున దాచేసిన సావిత్రికి జమున తీరు నచ్చదు. పెళ్లి పుస్తకంలో రాజేంద్ర ప్రసాద్ హ్యూమర్, టాలెంట్ కి సింధుజ ఇంప్రెస్ అవుతుంది. అతని వెంట పడుతుంది. అది భార్యగా దివ్యవాణి చూడలేకపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మిస్సమ్మ సినిమాతో పెళ్లి పుస్తకం చిత్రానికి చాలా పోలికలు ఉన్నాయి. అయితే పెళ్లి పుస్తకం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మిస్సమ్మను గుర్తు చేయదు.