Balochistan : 60 వేల మంది బెలూచీల అంతర్ధానం.. ఈ మారణ హోమానికి అంతమెప్పుడు?

ఇప్పటికీ బెలుచీస్తాన్ పై పాక్ సైన్యం మహిళలపై అత్యాచారాలు, హత్యలు, బెలూచీస్తాన్ పై దారుణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 60వేల మంది బెలుచీస్తానీయులను చంపేశారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేసింది. వారి కుటుంబాలు ఎంతో దీనస్థితిలో ఉన్నాయి.

Written By: NARESH, Updated On : May 22, 2023 10:04 am
Follow us on

Balochistan : ఆధునిక ప్రపంచపు మారణహోమాల్లో ఈరోజు అతి ప్రధానమైనది ‘బెలూచీల మరణాలు’. దురదృష్టవశాత్తూ ప్రపంచం ఈ పాక్ లో జరుగుతున్న ఘోరాలను గుర్తించడం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం బెలూచీలను ఘోరాతి ఘోరంగా చంపేస్తున్నా ప్రపంచం పట్టించుకోవడం లేదు.

నేపాల్, భూటాన్, సిక్కింలతో పాటు సమాన స్థాయి ఉన్నటువంటి ఖాన్ ఆఫ్ ఖలాస్తాన్ సంస్థానాన్ని పాకిస్తాన్ బలవంతంగా లాక్కుంది. విచిత్రం ఏంటంటే.. ఏ జిన్నా అయితే బ్రిటీష్ ముందు ‘బెలుచీస్తాన్’కు స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడో అదే జిన్నా పాకిస్తాన్ ప్రధాని అయ్యాక బలవంతంగా ఆ బెలుచీస్తాన్ ను పాక్ లో కలిపేశాడు.

ఇప్పటికీ బెలుచీస్తాన్ పై పాక్ సైన్యం మహిళలపై అత్యాచారాలు, హత్యలు, బెలూచీస్తాన్ పై దారుణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ మొత్తం 60వేల మంది బెలుచీస్తానీయులను చంపేశారు. వారు ఎక్కడున్నారో కూడా తెలియకుండా చేసింది. వారి కుటుంబాలు ఎంతో దీనస్థితిలో ఉన్నాయి.

మామ ఖాదిర్ బెలూచీ అనే బ్యాంక్ ఉద్యోగి తన కొడుకును పాక్ సైన్యం తీసుకెళ్లి చంపేయగా.. వారికి వ్యతిరేకంగా పోరాడాడు. ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో బెలూచీలతో కలిసి ఓ పోరాట సంస్థను స్థాపించి పాక్ పై పోరాడుతున్నారు.

బెలూచిస్థాన్ లో జరుగుతున్న ఘోరాలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.