Homeఎంటర్టైన్మెంట్Neha Dhupia: గర్భం దాల్చానని చెప్పా.. రెండో మాట లేకుండా ఒప్పుకున్నారు.. మూడు రోజుల్లో పెళ్ళి...

Neha Dhupia: గర్భం దాల్చానని చెప్పా.. రెండో మాట లేకుండా ఒప్పుకున్నారు.. మూడు రోజుల్లో పెళ్ళి చేశారు..

Neha Dhupia: నేహా ధూపియా.. తెలుగులో తక్కువ పరిచయం.. బాలీవుడ్ లో మాత్రం ఒక ఊపు ఊపింది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది. మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ.. ఎందుకనో తర్వాత ఈమెకు లక్ కలిసి రాలేదు. దీంతో ఐటెం సాంగ్స్ కు పరిమితం అయిపోయింది. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోనూ పలు అఫైర్లతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అయితే 2002లో ఈ బాలీవుడ్ సుందరి ఫేమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రాజశేఖర్ హీరోగా రూపొందిన విలన్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. బాలకృష్ణ హీరోగా రూపొందిన పరమవీరచక్ర సినిమాలోనూ కనిపించింది.

ఇక గత ఏడాది బాలీవుడ్లో రూపొందిన థర్స్డే అనే సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఆ తర్వాత తెరమీద అంతంతమాత్రంగానే కనిపించింది. అయితే ఇటీవల ఈ నీలి కళ్ళ సుందరి ఒక ఆన్లైన్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూ కు హాజరైంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 2018 మే లో నేహా బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని వివాహం చేసుకుంది. అయితే వీరి పెళ్లి చేసుకున్న కొద్ది నెలలకే ఒక బిడ్డ జన్మించాడు. అయితే అప్పుడు ఈ జంట మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కొంతమంది అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి అంటూ వీరిద్దరిని ట్యాగ్ చేస్తూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో తమ మీద వచ్చిన ట్రోల్స్ ను పట్టించుకోలేదని నేహా ధూపియా చెప్పుకొచ్చింది.

అయితే నేహా అంగద్ పెళ్లికి ముందే సహజీవనం కొనసాగించారు. ఏళ్లపాటు ఒకే ప్లాట్ లో కలిసి ఉన్నారు. అప్పుడు నేహా గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో 72 గంటలు అంటే మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో నేహా ముంబై నగరంలోని ఓ ఫంక్షన్ హాల్ లో కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందు తాను గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేందుకు తీవ్ర ఉద్వేగానికి గురయ్యానని ఇంటర్వ్యూలో పేర్కొంది. 2018లో ఒకటైన ఈ జంటకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అన్నట్టు నేహా నటించిన జూలీ అనే సినిమా అప్పట్లో బాలీవుడ్లో ఒక సంచలనానికి కేంద్రబిందువైంది. దానికి అనుగుణంగా కెరియర్ మలచుకోవడంలో నేహా విఫలమైంది. లేకుంటే బాలీవుడ్ లో ఇప్పటికీ ఆమె చక్రం తిప్పేది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version