Balakrishna: ఓ పక్క తన సొంత సోదరి ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొని బాధతో ఉన్న బాలయ్య బాబును ఓ అభిమాని పుండు మీద కారం చల్లేలా వ్యవహరించాడు. కానీ అప్పటికే బాధలో ఉన్న బాలయ్య ఏమీ అనకుండా నిస్సహాయంగా కారులో వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి తాజాగా ఆత్మహత్య చేసుకొని తనువుచాలించిన సంగతి తెలిసిందే. ఈ హఠాత్ పరిణామానికి నందమూరి ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలయ్య బాబు సోదరి ఉమామహేశ్వరి అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు.స్వయంగా చెల్లి పాడె మోశారు. అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాడు.
అంతక్రియలు ముగిశాక ఉమామహేశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోతుండగా మీడియా ముందు మాట్లాడాలని జర్నలిస్టులు కోరినా కూడా బాధాతాప్త హృదయంతో బాలయ్య మాట్లాడలేకపోయాడు. ఇక అక్కడే జనంలో ఉన్న ఒక అభిమాని.. సెల్ఫీ కావాలంటూ బాలయ్యను అడిగాడు. దానికి ఒక తీక్షణమైన చూపు చూసిన బాలయ్య బాధతో కారులో వెళ్లిపోయాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు అందరూ ఆ సెల్ఫీ అడిగిన అభిమానిపై మండిపడుతున్నారు. బాధలో ఉన్న బాలయ్యతో సెల్ఫీ ఏంట్రీ అంటూ చీవాట్లు పెడుతున్నారు. బాధలో లేకుండా బాలయ్య ఆ అభిమాని చెంప పగులకొట్టేవాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదివరకూ అనంతపురం, హిందూపురం సహా వివిధ పర్యటనల్లో ఇలాగే అతి చేసిన ఫ్యాన్స్ చెంప చెళ్లుమనిపించేవాడు బాలయ్య. దానికి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు చెల్లిపోయిన బాధలో ఉండి బాలయ్య వ్యవహరించిన తీరు అందరి చేత ప్రశంసలు దక్కేలా చేసింది. బాలయ్యను కావాలనే ఫ్యాన్స్ టెంప్ట్ చేస్తున్నారని.. ఆయన లూజ్ కారని ఈ వీడియోను బట్టి తెలుస్తోంది.