Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. శివసేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతుందా..? లేదా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలో సీఎం ఉద్దవ్ థాక్రే శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. రాజకీయ సంక్షోభం గురించి ముందే ఊహించానని, అయితే ఏక్ నాథ్ షిండే ఇలా వెన్నుపోటు పొడుస్తారని అనుకోలేదని అన్నారు. అంతేకాకుండా రెబల్ ఎమ్మెల్యేలంతా బీజేపీకిలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ కాంగ్రెస్, ఎన్సీపీలు తనకు మద్దతు ఇస్తున్నారన్నారు. సొంతవాళ్లు ద్రోహం చేసినా ఇతర పార్టీనాయకులు మద్దతివ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి విజయం సాధించిన శివసేనకు.. అప్పుడు కమలం పార్టీకి చేసిన ద్రోహం గుర్తురాలేదా..? అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వెన్నుపోటు గురించి ‘ఉద్దవ్’ మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని అంటున్నారు.

2019 అక్టోబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి శాయశక్తుల శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శివసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాలుండగా ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. బీజేపీ 144 , శివసేన 126 స్థానాల్లో బరిలోకి దిగాయి. మిగతా 18 స్థానాలు ఇతర మిత్రపక్షాలకు కేటాయించారు. అయితే అంతకుముందు తమకు సగం సీట్లు కేటాయించాలని శివసేన డిమాండ్ చేసింది. కానీ అమిత్ షా రంగంలోకి దిగి సీట్ల సర్దుబాటు చేయించారు. 2014లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసినా 2019లో మాత్రం కలిసి పోటీ చేశాయి.
ఆ తరువాత వచ్చిన ఫలితాల్లో బీజేపీ, శివసేన కూటమి 160 స్థానాల్లో గెలుపొందాయి. బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందాయి. ఇక కాంగ్రెస్ 104 స్థానాల్లో విజయం సాధించి. ఈ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ లకు పోటా పోటీ మెజారిటీ రావడంతో శివసేన కీలకంగా మారింది. శివసేనకు స్పష్టమైన మెజారిటీ రాకపోయినా ఆ పార్టీ ఎటువైపు వెళితే అటు ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఏర్పడింది. అయితే అప్పటి వరకు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ అఘాడి’ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్, బీజేపీ నేత మాట్లాడుతూ ఇలా ఒక పార్టీతో గెలిచి మరో పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనైతికమని అన్నారు. మరికొందరు నేతలు మాట్లాడుతూ శివసేన ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగదని అన్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా మూడేళ్ల పాటు ఎన్నో ఆటు పోట్ల మధ్య ప్రభుత్వాన్ని కొనసాగించిన శివసేనకు సొంత పార్టీ నుంచే తిరుగుబాటు మొదలైంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రేకు అత్యంత సన్నిహితుడైన ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు వెనుక అనే కారణాలున్నాయని చెప్పుకుంటున్నారు. కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని, దీంతో సీఎం వారి చేతిలో కీలుబొమ్మగా మారారని అన్నారు. ఈ విషయాలను చెబుతామని వెళితే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేని ఏక్ నాథ్ షిండేతో సహా పలువురు ఎమ్మెల్యేలు వాపోయారు.

కానీ ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ సొంత పార్టీలో ఉంటూ షిండే మోసం చేశారని అంటున్నారు. కానీ గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగి 56 సీట్లు తెచ్చుకున్న శివసేన ఆ తరువాత కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మోసం కాదా..? అని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంలో ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. కానీ నైతికంగా మాత్రం స్వచ్ఛత ఉండాలని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా బీజేపీ వెనుక ఉండి కుట్ర చేస్తోందని శివసేన మద్దతుదారులు అంటున్నారు. అలాంటప్పుడు బీజేపీ ఎప్పుడో కుట్రపన్ని ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేది కదా..? అని వాపోతున్నారు.
మొత్తంగా శివసేన ప్రవర్తనే తనను ఈ స్థితికి తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన తీరుతో కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారిని కట్టడి చేయాల్సింది పోయి తనను పార్టీ నాయకులు మోసం చేశారనడం హస్యాస్పదంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా ఉద్దవ్ థాక్రే లాంటి వాళ్లు వెన్నుపోటు గురించి మాట్లాడడం మరింత విచిత్రంగా ఉందంటున్నారు. ఒకప్పుడు బీజేపీకి శివసేన చేయివ్వగా..ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేల రూపంలో ఆ పరిస్థితి తిరుగుబాటుగా మారిందని అంటున్నారు.
Also Read:Pawan Kalyan: బీజేపీతోనే వైసీపీ.. టీడీపీతో వద్దు.. పవన్ ఏం చేయనున్నారు?
[…] […]
[…] […]