Pakistan Prime Minister Imran Khan: పాకిస్తాన్.. మన శత్రుదేశంలో ‘ప్రజాస్వామ్యం’ నాలుగు పాదాలపై నడిచి చాలా కాలమైంది. తుపాకీ(సైన్యం) కనుసన్నల్లోనే అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో అధికారంలో ఐదేళ్లు కూర్చోవాలంటే సైన్యం చెప్పినట్టు చేయాల్సిందే. లేదంటే దేశాన్ని హస్తగతం చేయడమో.. పాకిస్తాన్ ప్రధానిని పక్కకు తప్పించడమో చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రధాని అభ్యర్థుల హత్యలు జరిగాయంటే సైన్యం పాత్ర ఎంత పవర్ ఫుల్ నో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడూ అదే జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ తో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెండింది. దీంతో అవిశ్వాసంతో ఆయన పోస్టు ఊస్ట్ గొట్టే చర్యలు ఊపందుకున్నాయి. సైన్యానికి వ్యతిరేకంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దించబోతున్నారు. ఈ క్రమంలోనే అసలు ఇమ్రాన్ ఖాన్ కు,సైన్యానికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వీరిద్దరికి ఎక్కడ చెడింది? పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆర్మీ పాత్ర ఎంత అనే దానిపై స్పెషల్ ఫోకస్..

పాకిస్తాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం ఖాయమని తెలుస్తోంది. సైన్యం, ప్రభుత్వం మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి సైన్యాధ్యక్షుడు సహాయ నిరాకరణ మొదలుపెట్టారు. వెంటనే కొందరు ఎంపీలు ఇమ్రాన్ కు షాకిచ్చి ఆయనపై అసమ్మతి రాజేశారు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలున్నాయి. అయితే పాకిస్తాన్ లో సైన్యం మద్దతు లేనిదే ఏ ప్రభుత్వం నిలబడదనేది వాస్తవం. 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ కు సైన్యం మద్దతు ఇవ్వడంతోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యింది. అయితే అదే సైన్యం ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ కు, సైన్యాధ్యక్షుడు ఖమర్ జావెద్ బజ్వాల మధ్య విభేదాలు రావడానికి కారణం ఏమిటి..? వీరిద్దరి మధ్య ఎక్కడ చెడిందన్నది ఆసక్తిగా మారింది.
Also Read: Telangana Cabinet Expansion: కేసీఆర్ కుటుంబంలో మరో నిరుద్యోగికి ఉద్యోగం!
2018 పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) విజయం సాధించింది. అయితే ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అనుకున్న మెజారిటీ సాధించలేదు. దీంతో సైన్యం, ఇంటర్ సర్వీస్ ఇంటెలీజెన్స్ (ఐఎస్ఐ) అండతో పీటీఐ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలో కూర్చుంది. ఇమ్రాన్ కు మద్దతుగా నిలిచి ఆయనను ప్రధానిని చేసిన సైన్యాధ్యక్షుడు ఖమర్ జావెద్ బజ్వా పదవీ కాలం 2019 నవంబర్ 29తో ముగిసింది.. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయితే తన పదవీకాలాన్ని పొడగించుకోవచ్చని బజ్వా భావించారు. అయితే ఖమర్ జావెద్ పదవీకాలాన్ని పొడగించడం ఇమ్రాన్ ఖాన్ కు ఇష్టం లేదు. సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఇమ్రాన్ ఆయిష్టంగానే ఖమర్ పదవీ పొడగింపునకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇమ్రాన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా 2019 నవంబర్ 28న పాక్ సుప్రీం కోర్టు ఈ ఉత్తర్వులను కొట్టి వేసింది. అంతేకాకుండా ఆరునెలల గడువు ఇచ్చి ఈలోపు జాతీయ అసెంబ్లీలో చట్టసభలో ఈ ప్రతిపాదన చేయాలని సూచించింది. ఇదంతా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కావాలనే చేస్తున్నాడని సైన్యాధ్యక్సుడు ఖమర్ భావించాడు. దీంతో వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
మరోవైపు తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించినప్పుడు ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ పశ్చిమ దేశాల ఆగ్రహానికి గురయ్యాడు. అమెరికాతో పాటు తదితర దేశాలు పాక్ నిర్ణయంపై విమర్శలు చేశాయి. అంతకుముందు పాక్ పై అంతో ఇంతో అమెరికాకు కాస్త కనికరం ఉండేది. అయితే తాలిబన్ల విషయంలో ఇమ్రాన్ ఖాన్ తీసుకున్న నిర్ణయంతో పూర్తిగా పశ్చిమదేశాలకు దూరమైనట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటివరకు పాక్ ప్రధానితో మాట్లాడకపోవడం ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.

ఇక ఇమ్రాన్ ఖాన్ పై వ్యతిరేకత రావడానికి మరో కారణం ఉంది. ఇంటర్ సర్వీస్ ఇంటెలీజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ ఫయాజ్ అహ్మద్ బదిలీ అంశం ఇమ్రాన్ ఖాన్ పదవికి ఎసరు తెచ్చింది. ఇమ్రాన్ కు అత్యంత సన్నిహితుడైన ఫయాజ్ ప్రభుత్వంలో కీరోల్ అయ్యారు. 2018 ఎన్నికల్లో పలువురు రాజకీయ పార్టీల నాయకులను బెదిరించి ఇమ్రాన్ పార్టీలో చేరేలా చేశారని ఫయాజ్ పై ఆరోపణలు ఉన్నాయి. నవాజ్ షరీఫ్ ను ఓడించేందుకు దక్షిణ పంజాబ్ లో ప్రత్యేకంగా ఓ పార్టీని పెట్టించినట్లు చెబుతారు. అయితే అప్పటి వరకు ఐఎస్ఐ కి డిప్యూటీ చీఫ్ గా ఉన్న ఫయాజ్… ఇమ్రాన్ అధికారంలోకి రాగానే పూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
ఇక తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్న సమయంలో కాబూల్ వెళ్లిన ఫయాజ్ అక్కడ వారి ఆతిథ్యాన్ని పొందడం పెద్ద వివాదాస్పదమైంది.. అయితే పాక్ సైనికాధ్యక్షుడు ఖమర్ జావెద్ కు ఈ వ్యవహరం నచ్చలేదు. దీంతో ఫయాజ్ ను షెషావర్ కు బదిలీ చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్ కు ఖమర్ జావెద్ కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి.. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ ను సైన్యాధ్యక్షుడిగా చేయాలని ప్రధాని ఇమ్రాన్ భావిస్తున్నాడట. ఈ విషయం గ్రహించిన ఖమర్ జావెద్ పాక్ ప్రధానిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్లో ఆయన పదవీకాలం ముగియనుంది. ఇమ్రాన్ అధికారంలో ఉంటే తన పదవికి గండం ఏర్పడే అవకాశం ఉందని భావించిన ఖమర్ ఏకంగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రధాని పదవిలోంచి సాగనంపేందుకు రెడీ అయ్యారు.
Also Read:US Warning To India: భారత్ కు అమెరికా హెచ్చరిక.. చైనా యుద్ధానికొస్తే రష్యా రక్షిస్తుందా?