Telangana Cabinet Expansion: తెలంగాణ క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు వేళయింది. ఇప్పటికే క్యాబినెట్ లో కొత్తవారికి చోటు కల్పించాల్సి ఉండగా అనేక కారణాల వల్ల వాయిదాపడుతూ వస్తోంది. శాసన సభ సమావేశాలు, యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు పూర్తి కావడంతో ఉగాది తర్వాత అంటే ఏప్రిల్ మొదటి వారంలో లేదా రెండో వారంలోనో తెలంగాణ మంత్రవర్గంలో మార్పులకు సీఎం చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టొచ్చనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న మంత్రి వర్గంలో ఐదుగురికి ఉద్వాసన పలికి ఆ స్థానాల్లో ఐదుగురు కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించేందుకు సీఎం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

వాయిదాకు కారణాలు అనేకం..
సీఎం చంద్రశేఖర్‌రావు ఏదీ చెప్పి చేయరు. ముహూర్తం ప్రకారం కూడా పెద్దగా అడుగులు వేయరు. ఎవరైనా చెప్పారనో, ఒత్తిడి తెచ్చారనో ఆ పని చేయరు. తనకు వీలైనప్పుడు, చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. తెలంగాణ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ కూడా అదే విధంగా జరగబోతోంది. తెలంగాణ క్యాబినెట్ కూర్పు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నపటికి అనేక కారణాలవల్ల వాయిదా పడుతూవస్తోంది. ఆశావహులు మాత్రం తెలంగాణ భవన్, ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు. మరికొంత మంది ఎర్రవల్లి ఫాంహౌస్ కు సైతం రూట్ మార్చినట్టు తెలుస్తోంది.
Also Read: Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన 6 సినిమాల్లో ఎన్ని హిట్టు ? ఎన్ని ప్లాప్ ?
అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కూర్పు..
తెలంగాణ క్యాబినెట్ విçస్తరణకు సీఎం చంద్రశేఖర్‌రావు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉగాది తర్వాత క్యాబినెట్ కూర్పును చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ఐదుగురికి ఉద్వాసనపలికే అవకావం ఉందిని తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొంత మంది మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని, ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్ధాయిలో ప్రజలకు వివరంచడంలో విఫలం చెందుతున్నారని సీఎం చంద్రశేఖర్‌రావు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఐనప్పటికీ సీఎం హెచ్చరికలను పెడచెవిన పెట్టిన మంత్రులకు ఉద్వాసన తప్పదనే చర్చ జరుగుతోంది.

అన్ని సామాజికవర్గాలను సంతృప్తి పరిచేలా..
ఉత్తర తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు, దక్షిణ తెలంగాణ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో చా¯Œ ్స దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా నగరానికి సంబందించిన ఓ మంత్రికి కూడా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్వాసన పలికే మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను తిరిగి మంత్రులుగా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా ప్రతీ వర్గానికి గుర్తింపునిచ్చే విధంగా మంత్రివర్గ కూర్పు చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ కూర్పులో మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: AP New Districts: ప్రభుత్వ పంతం.. కొత్త జిల్లాలకు తుది రూపం
.
[…] RRR Box Office Collection: జక్కన్న చెక్కిన మాయాజాలం త్రిబుల్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా అంతటా విజయ ప్రభంజనమే మోగిస్తోంది. మొదటి నుంచి ఈ మూవీపై ఉన్న భారీ అంచానాలే ఇందుకు ప్రధాన కారణం. పైగా రాజమౌళి దర్శకత్వం చేయడం ఒక కారణం అయితే.. ఎన్టీఆర్, చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు యాక్ట్ చేయడం మరో కారణం. […]
[…] Prabhas Adipurush: నేషనల్ స్టార్ ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు అనగానే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” రాబోతుంది. దీనికితోడు బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఐతే తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. […]
[…] IPL 2022 CSK vs LSG: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఉన్న చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న టీమ్. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా గెలవగలిగే నైఫున్యం ఉన్న ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. పటిష్టమైన బ్యాటింగ్‌తో పాటు.. పదునైన బౌలింగ్ సీఎస్‌కే కు ఉన్నాయి. కానీ ఐపీఎల్ 15వ సీజన్‌లో దారుణమైన చెత్త రికార్డులను నెలకొల్పుతోంది. […]
[…] Junior NTR Politics: చంద్రబాబు వయసు 70 ఏళ్లు.. మహా అయితే ఇంకో పదేళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఆయన ఉంటారు. ఆ తర్వాత వృద్ధాప్యం బారినపడుతారు. ఆయన వారసుడు లోకేష్ శక్తి సామర్థ్యాల గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు తెగ వర్రీ అయిపోతున్నారట..జూ.ఎన్టీఆర్ రావాలంటూ ఇప్పటికే చంద్రబాబు ముందే కుప్పం సహా వివిధచోట్లలో గళమెత్తుతున్నారు.కానీ జూ.ఎన్టీఆర్ మనసులోని మాట మాత్రం ఇప్పటిదాకా బయటపడలేదు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? అన్నది మాత్రం అంతుబట్టలేదు. తాజాగా ఓ జాతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయ అరంగేట్రంపై జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు వైరల్ అయ్యాయి. […]