Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిన్న ఉత్తరాంధ్ర కేంద్రం గా చేసుకొని ఎంత వాడివేడిగా మారిపోయిందో మన అందరికి తెలిసిందే..ఒకపక్క వైసీపీ పార్టీ మూడు రాజధానులు అంటూ మహా గర్జన కార్యక్రమం చేపడితే, మరోపక్క పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర లో మూడు రోజుల పాటు పర్యటన చేపట్టనున్నాడు..దీనితో నిన్న వైజాగ్ విమానాశ్రయం లో పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని అధికార పార్టీ మంత్రులు కూడా తట్టుకోలేకపోయారు.

గర్జన కార్యక్రమం ని ముగించుకొని తిరిగి మంత్రులు తిరిగి ఇంటికి వెళ్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ అభిమానులు వారికి చుక్కలు చూపించిన సంఘటనలు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపింది..మంత్రి రోజా మరియు జోగి రమేష్ మీద పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాడి కి ముందుకి వచ్చారు..మంత్రుల కార్లు కూడా ద్వాంసం అయ్యాయి..పటిష్టమైన పోలీస్ సెక్యూరిటీ ద్వారా వీళ్ళు సురక్షితంగా బయటపడగలిగారు..ఇక పవన్ కళ్యాణ్ వైజాగ్ లో అడుగుపెట్టిన తర్వాత అభిమానులు ఆయనకీ అడుగడుగునా నీరాజనాలు పలికారు.
అయితే పవన్ కళ్యాణ్ ర్యాలీని అడ్డుకునేందుకు అడుగడుగునా వైసీపీ పార్టీ అడ్డంకులను సృష్టిస్తూనే ఉన్నది..పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్తున్న దారిలో వీధి లైట్స్ ని ఆపేసారు..అభిమానులు మొబైల్ లైట్స్ ద్వారా పవన్ కళ్యాణ్ ర్యాలీని కొనసాగించారు..మార్గం మధ్యలో పోలీసులు పవన్ కళ్యాణ్ వెంట వస్తున్న అభిమానులను చెదరగొట్టారు..ఇక జనసేన పార్టీ నాయకులను అరెస్ట్ చేసారు..అంతే కాకుండా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ బస చేస్తున్న నోవొటెల్ హోటల్ లోకి చొరబడి జనసేన పార్టీ నాయకులూ సుందరపు విజయ్ కుమార్ మరియు పి.వి.ఎస్.ఎన్. రాజులను పోలీసులు అరెస్ట్ చేసారు.
ఇది తెలుసుకున్న పవన్ కళ్యాణ్ రేపు వెంటనే వాళ్ళని విడుదల చెయ్యకపోతే నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను అంటూ హెచ్చరించాడు..రేపు పవన్ కళ్యాణ్ ఒకవేళ పోలీస్ స్టేషన్ కి మాత్రం వస్తే అల్లకల్లోలం అయిపోతుంది..పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ..ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్రం మొత్తం అశాంతి వాతావరణం చూడాల్సి వస్తుంది..రేపటి పరిస్థితి ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.