
AP Politics : కాపులు రాజకీయంగా రాణించకూడదన్న కోణంలో వారిపై జరిగిన కుట్రలు.. మరి ఏ సామాజికవర్గంపై జరగలేదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి వందల కోట్ల రూపాయలు పోగేసుకున్నారని ఆరోపించడంలో రెడ్డి, కమ్మ సామాజికవర్గం ముందుండేది. కేవలం డబ్బుల సంపాదనకే చిరంజీవి పార్టీ పెట్టారంటూ అప్పట్లో ఎల్లో, నీలి మీడియా గొంతు చించుకొని అరిచింది. చివరికి చిరంజీవి జెండా పీకేస్తున్నారంటూ ముందుగానే ఊరూ వాడా హోరెత్తించారు. కాంగ్రెస్ లో విలీనం తప్పని అనివార్య పరిస్థితులు కల్పించారు. అయితే ఇప్పుడు జనసేన విషయంలో సైతం అదే ప్రచారం చేశారు. పవన్ ప్యాకేజీ నాయకుడు అంటూ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం తాను సంపాదించిన సొమ్మును ఖర్చుచేస్తున్నా… తిరిగి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి ఎంట్రీ కాక మునుపే.. తెలుగుదేశం పార్టీ ప్యాకేజీ బాగోతం బయటపడింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్యాకేజీ వెనుక ఉన్న కథను వెల్లడించారు. రాష్ట్ర విభజనకు మునుపు రాయపాటి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కానీ చంద్రబాబు ఒక షరతుపై ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారని ప్రచారం నడిచింది. అప్పటికే టీడీపీ వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ పార్టీ నేతలు ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. రాయపాటిని ఎంపీగా నిలబెట్టి లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఖర్చు బాధ్యతను ఆయనకే అప్పగించారు. ఇప్పుడు కన్నా టీడీపీలో చేరుతారనగా రాయపాటి బాంబు పేల్చారు.

గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్ తాడికొండ, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. అప్పట్లో టీడీపీలో చేరి ఎంపీగా పోటీచేసిన రాయపాటి నియోజకవర్గానికి రూ.5 కోట్లు ఇచ్చినట్టు చెబుతున్నారు. మొత్తం రూ.35 కోట్లు ఇచ్చి ఎంపీ సీటు కొనుగోలు చేసినట్టు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందులో యరపతినేని శ్రీనివాసరావుకే రూ.11 కోట్లు అందించినట్టు రాయపాటి తాజాగా కామెంట్స్ చేశారు.
కన్నాతో రాయపాటికి ఉన్న విభేదాలు ఇప్పటివి కావు. కాంగ్రెస్ పార్టీలో ఒకరు ఎంపీగా, మరొకరు మంత్రిగా ఉండేవారు. కానీ వారి మధ్య వైరం పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న విధంగా ఉండేది. రాష్ట్ర విభజన సమయంలో రాయపాటి టీడీపీలోకి, కన్నా బీజేపీలో చేరారు. రాజకీయంగా చెరో మార్గంలో ఉన్న వారి మధ్య విభేదాలు మాత్రం సమసిపోలేదు. మొన్నటివరకూ ఇద్దరి మధ్య ఒక కేసు కూడా నడిచేది, టెక్నికల్ ఇబ్బందులు రావడంతో రాజీపడ్డారు. కానీ ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కన్నా టీడీపీలో చేరతామనడం, అందుకు రాయపాటి అభ్యంతరం వ్యక్తం చేయడం, అదే సమయంలో గుంటూరు జిల్లాలోని మిగతా టీడీపీ నాయకులు రాయపాటిపై ఫైర్ కావడంతో… ఈ వృద్ధ నేత జరిగిన విషయాన్ని బయటపెట్టేశారు. కేవలం రాజకీయ స్ట్రేటజీ, కాపులు ఎదగకూడదన్న ఒకే కోణంలో చిరంజీవి, పవన్ లపై ఆరోపణలు చేస్తూ వచ్చిన పసుపు నేతలు, ఎల్లో మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ..