Indus Water Treaty : సింధూ జలాల వల్లే పాకిస్తాన్ ఇంత పచ్చగా ఉంది. కానీ ఆ సింధూ నది పుట్టింది మన హిమాలయాల్లోనే. మన కశ్మీర్ నుంచే పాకిస్తాన్ లోకి వెళుతుంది. కానీ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. మన దేశాన్ని దెబ్బతీస్తూ రక్తపుటేరులు ప్రవహింప చేస్తున్న పాకిస్తాన్ కు బుద్ది చెప్పాలని మోడీ నిర్ణయించాడు. తాజాగా పాకిస్తాన్ కు ఆయువు పట్టు అయిన సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామని ప్రతిపాదిస్తూ పాకిస్తాన్ కు భారత్ ఓ నోటీస్ జారీ చేసింది. తద్వారా ఆరు దశాబ్ధాల నాటి సింధునదీ జలాల ఒప్పందాన్ని మార్చేందుకు నరేంద్రమోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
ఒప్పందం అమలులో పాకిస్తాన్ ఉల్లంఘనలు, మొండి వైఖరి వల్లే భారత్ ఈ విధమైన నోటీసు జారీ చేయాల్సి వచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. మోడీ చాలా కాలంగా దీనిపై ఆలోచిస్తున్నారు. 2016 సెప్టెంబరులోనే మోడీ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి సమీక్షించాడు.
సింధూ నది వివాదం ఏంటి? అసలు నరేంద్రమోడీ ప్లాన్ ఏంటి ? ఏం చేయాలనుకుంటున్నారన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
