Walking Benefits: మారుతున్న జీవన శైలితో మనకు రోగాలు వస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, గుండెపోటు, క్యాన్సర్లు వంటివి దరిచేరుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో జీవితకాలం మందులు మింగుతూ బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. వ్యాయామం చేయకపోవడంతో చాలా రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. అందరు బద్ధకస్తులుగా మారుతున్నారు. రోజులో కనీసం ఓ గంట సేపైనా వ్యాయామం చేయాలనేది కనీసం పాటించడం లేదు. దీంతోనే పలు రకాల జబ్బులకు నిలయంగా మారుతున్నారు.

నగరాలు, పట్టణాల్లో కాస్త ఆలోచన సరళిలో మార్పు వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా అవగాహన రాకపోవడంతో చాలా మంది ఉదయం పూట నడక కొనసాగించడం లేదు. వారానికి కనీసం 150 నిమిషాలైనా నడిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వాకింగ్ కు అంతటి ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో వాకింగ్ పై ప్రస్తుతం చాలా మందిలో ఉత్సాహం పెరుగుతోంది. దీంతో రోగాలు రాకుండా ఉండాలంటే వాకింగ్ చేయాలని సంకల్పిస్తున్నారు. వ్యాయామంతోనే మనకు ఆరోగ్య పరిరక్షణ దక్కుతుందని భావిస్తున్నారు.
అరవై ఏళ్ల పైబడిన వారు రోజుకు 6 వేల నుంచి 9 వేల అడుగులు నడిస్తే గుండె జబ్బుల ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. 50 శాతం పక్షవాతం ముప్పు ఉండదని సూచిస్తున్నారు. నడక తేలికైన వ్యాయామం కావడంతో అందరు కూడా దీన్నిపాటించాలని చూస్తున్నారు. కాళ్లకు షూ ధరించి వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే ఏ రోగాలు రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నడకతో దాదాపు 25 రకాల రోగాలు అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండటం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మనకు సంతోషం కలిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నడకతో ఇన్ని ప్రయోజనాలు దాగి ఉండటంతో క్రమం తప్పకుండా వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో అందరు నడక కొనసాగించి తమ జబ్బులను తగ్గించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.