Annamalai challenges DMK : తమిళనాడు రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. తమిళనాడు పోలీసులు అన్నామలైపై కేసు బుక్ చేశాయి. నిజానికి అన్నా మలై ఒకప్పుడు బడా పోలీస్ అధికారి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ కేసు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు కేసు ఏంటి.? వివాదం ఏంటన్నది తెలుసుకుందాం..
బీహార్ నుండి వలస వచ్చిన కార్మికులపై రాష్ట్రంలో దాడి జరిగిందని ఇటీవల వ్యాప్తి చెందిన ఫేక్ న్యూస్‌తో డిఎంకెకు లింక్ చేస్తూ తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై చెన్నై సైబర్ క్రైమ్ యూనిట్ కేసు నమోదు చేసింది. బీహార్‌కు చెందిన వలస కూలీలను దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్నామలై తన ప్రకటనలో డిఎంకెను నిందించారు. ఉత్తర భారతీయులు చేసిన పనిని “ఎగతాళి” చేయడానికి పార్టీ ప్రయత్నాలే నకిలీ వార్తలు ఇంత త్వరగా వ్యాపించడానికి కారణమని ఆరోపించారు.. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అన్నామలై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు, “సిఎం స్టాలిన్, ఇంత జరిగినా, ఉత్తర భారత కార్మికులపై ఇటువంటి ద్వేషపూరిత ప్రసంగాలను ఖండించలేదు. రాష్ట్రంలోని ఒక సమాజంపై అలాంటి ద్వేషాన్ని అరికట్టడానికి ఆయన ఎటువంటి చర్య తీసుకోలేదు. ” అని విమర్శించారు. దీంతో అన్నామలైపై కేసు పెట్టారు.
అన్నామలై వివాదం వెనుక అసలు నిజాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.