Andhra Politics : ఆంధ్రా రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే.. ఒక తరం మారింది. అందరూ యువతరం నాయకులు వచ్చేశారు. కొత్త జనరేషన్ వచ్చేసింది. బీజేపీకి పురంధేశ్వరి చీఫ్ గా ఉన్నారు. 64 ఏళ్ల వయసులో పార్టీని లీడ్ చేస్తున్నారు.మామూలుగా అది పెద్ద వయసు కాకపోవచ్చు కానీ మిగతా నేతలు జగన్, పవన్ లతో పోలిస్తే ఆమె వయసు ఎక్కువ. ఆమె ఫిట్ కాకపోవచ్చు. అందుకే బీజేపీ కూడా కొత్తతరం నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
మిగతా నాయకులందరినీ కూడా చూస్తే జగన్ 51 ఏళ్లు, షర్మిల 50 ఏళ్లు, నారా లోకేష్ 40 ఏళ్లు, పవన్ కళ్యాణ్ 52 ఏళ్లు.. ఈ నలుగురు కూడా యువతరమే. బీజేపీ ఎంత త్వరగా దీన్ని గుర్తించి ఒక యువతరం నాయకుడినో.. నాయకురాలినో తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణలో కూడా ఇది ఎప్పుడో మార్పు చెందింది. చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఈసారి పాదయాత్ర నారా లోకేష్ చేశారు. వాళ్ల పార్టీలో లోకేష్ ను కీలకం చేస్తూ ఎమర్జింగ్ లీడర్ ను చేస్తున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ కీలకంగా మారారు. తన కొడుకుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు కేసీఆర్.
ఇక బీజేపీకి మొన్నటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ యువకుడే. రఘునందన్ రావు, కొత్తగా పైడి రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్ లు యంగ్ నేతలే.తెలంగాణలో యంగర్ జనరేషన్ నే ప్రోత్సహించాయి.
ఈసారి 2024 ఎన్నికలు కొత్తతరం నాయకులే మధ్యే జరుగనున్నాయి. కొత్త తరం నాయకులతో మారిన ఆంధ్రా రాజకీయ ముఖచిత్రంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.