Mega Family Selfie: చిరు, నాగబాబు సెల్ఫీ.. వెనుక అకీరా తో సహా మెగా హీరోలు.. ఫొటోలు వైరల్

తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను మెగా బ్రదర్ నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. అందులో ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Written By: Swathi, Updated On : January 17, 2024 1:20 pm

Mega Family Selfie

Follow us on

Mega Family Selfie: సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ ఎంతో ప్రత్యేకంగా, ఎంతో ఘనంగా జరుపుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. బెంగళూరులోని ఫాంహౌస్ లో పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబం కూడా పాల్గొంది. మెగా వారసులు అంతా ఒకే చోట చేరి పండుగను జరుపుకున్నారు. మెగా బ్రదర్స్ తో పాటు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, శిరీష్ తో పాటు అకీరా నందన్ , ఆద్య, నిహారిక, ఉపాసన, వైష్ణవ్ తేజ్ అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

తాజాగా ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను మెగా బ్రదర్ నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. అందులో ఓ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా?? నాగబాబు, చిరంజీవి తీసుకున్న సెల్ఫీలో మెగా వారసులు కనిపించారు. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

నాగబాబు, చిరు సెల్ఫీలో వెనుక రామ్ చరణ్, అకీరా నందన్ మాట్లాడుకుంటూ కనిపించగా.. ఆ వెనుకాలే ఆద్య, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. అలాగే చరణ్ పక్కన వరుణ్ తేజ్, అల్లు శిరీష్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీకి చెందిన వారసులు అంతా ఒకే చోట, ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు మెగా సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే అకీరా నందన్ పియానో ప్లే చేయగా.. మెగా ప్రిన్సెస్, రామ్ చరణ్ – ఉపాసన గారాలపట్టి క్లింకారాతో అల్లు అర్జున్ కూతురు అర్హ డ్యాన్స్ చేసిన వీడియో సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి వేడుకలు మెగా ఫ్యామిలీ తో పాటు ఫ్యాన్స్ కు కూడా ప్రత్యేకంగా నిలిచాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.