Analysis On YSRCP Government Survey Results ఆంధ్రాలో ఓ పెద్ద చర్చ జరుగుతోంది. సీఎన్ఓఎస్ అనే సర్వే హాట్ టాపిక్ గా మారింది. మోస్ట్ పాపులర్ పీఎం మోడీకి రేటింగ్ ఎలా ఉంది? రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రేటింగ్ ఎలా ఉంది.వీటికి సంబంధించి జాతీయ స్తాయిలో ఓ సర్వే చేసింది.

సీఎంలు అనేసరికి మన తెలుగు రాష్ట్రాల సీఎంలను లెక్కగట్టారు.ఏపీ సీఎం జగన్ కు 39శాతం మంది సంతృప్తి చెందారు. 29 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు.32 మంది ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు. మొత్తం ముఖ్యమంత్రుల్లో దేశంలో 20వ ర్యాంకులో ఉన్నారు.
కేసీఆర్ కు వచ్చేసరికి 49 శాతం సంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా 19 , ఏమీ చెప్పలేని వారు 24. దేశంలో 11వ పాపులర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఈ సర్వే శాస్త్రీయంగా చేశారన్నది ఇందులో లేవు. ఆరాసర్వే చాలా పారదర్శకంగా చేశారు. సీఎన్ఓఎస్ లో ఆ వివరాలు లేవు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ సర్వే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఆరా మస్తాన్ బీజేపీకి దగ్గరగా ఉండడంతో బీజేపీ కి దగ్గరగా ఉందని అంటున్నారు.
సీఎన్ఓఎస్ రాబిన్ శర్మ చంద్రబాబు మనిషి అని.. కానీ సర్వేలు ఇలా చేస్తే క్రెడిబిలిటీ పోతుంది. పార్టీ కోసం సర్వేను మ్యానుక్యులేట్ చేస్తే మరోసారి ఎవరూ పరిగణలోకి తీసుకోరు. జగన్ పాలన తెలుసుకోవాలంటే సర్వే అవసరం లేదన్నది అందరి అభిప్రాయం. జగన్ పాలన.. అప్పులు, ఆర్బీఐ సర్వే చూస్తే చాలు జగన్ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి.. ఈ క్రమంలోనే జగన్ పాలన.. సర్వేల తీరుపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.