Analysis On YSR Kapu Nestham Scheme : ఏపీ సీఎం జగన్.. నిన్న గొల్లప్రోలులో జరిగిన కాపు నేస్తం మహాసభలో కాపులను కించపరిచేలా మాట్లాడారు. జగన్ మాటల వెనుక అసలు నిజాలు ఏమిటీ? జగన్ వెళ్లింది ప్రభుత్వానికి .. అక్కడ అమ్ముడుపోయే అనే మాట రాకుండా మాట్లాడలేరా? జగన్ మాటలు ఆయన మనస్తత్వాన్ని.. ఓట్ల కోసం ఎవరినైనా కొనవచ్చు అన్న భావన వ్యక్తమవుతోంది.

ఒకనాడు 1970లోనే గుంటూరు రెండు నియోజకవర్గాల్లో చేబ్రోలు హనుమయ్య లాంటి ఉద్దండునిని.. ఒక చిన్న మాట అన్నాడని ఓడించి ప్రజలు కూర్చోబెట్టారు. కులాల కించపరిచేలా మాట్లాడవద్దన్నది ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. కాపులు అమ్ముడుపోరని.. వారంతా ఒక్కతాటిపైకి నడవాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఇచ్చే బిక్ష అయిన కాపు నేస్తం కోసం కాపులు ఎప్పుడూ వెంపర్లాడడం లేదు. ఎన్నాళ్లీ ఇలా పల్లకీమోయడం.. అని వారు ఆలోచనలో పడ్డారు. రాజ్యాధికారం కోసం కాపులు ఎప్పటి నుంచో ఆరాటపడుతున్నారు.
అటు ఉమ్మడి ఏపీలో.. ఇటు విభాజిత ఏపీలో కాపులు మెజార్టీ స్థాయిలో ఉన్నారు. కానీ ఇప్పటికీ వారికి రాజ్యాధికారం అన్నది దక్కలేదు. అనాదిగా ఓటు బ్యాంకుగా కాపులను వాడుకున్నారు. ఈసారి మాత్రం కాపులు మోసపోవడానికి సిద్ధంగా లేరు. గుణపాఠం చెప్పాలని వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కాదు.. మార్చి మార్చి అధికారం పంచుకునే ఆస్తి కాదు.
ఇది ప్రజాస్వామ్యం.. ప్రజాపరిపాలన రావాలి. బడుగు బలహీన వర్గాలు అధికారంలోకి రావాలన్నది కాపుల ఉబలాష. అందరినీ కలుపుకొని కాపులు అధికారంలోకి రావాలని కాపులు భావిస్తున్నారు. అందుకే జగన్ కు వణుకు పుట్టి గోదావరి జిల్లాలకు వచ్చి కాపులను చీల్చాలని ఎత్తుగడ వేస్తున్నారు. ‘జగన్ కాపులపై చూపిస్తున్న వల్లమాలిన ప్రేమ’పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.