Ghost marriage కర్ణాటకలో ప్రేత వివాహం జరిగింది.. చనిపోయిన 30 ఏళ్లకు పెళ్లి చేసేశారు. ఇదేం ప్రేతాత్మల వివాహంరా నాయనా అని అందరూ నోరెళ్లబెట్టారు. విశేషం ఏంటంటే సంప్రదాయబద్దంగా పెళ్లి చేసి ఊరంతా మంచి విందు భోజనం పెట్టాడు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

కర్ణాటకలో అనాదిగా ఓ సంప్రదాయం నడుస్తోంది. కాన్పు సమయంలో మరణించిన పిల్లలకు వారి జీవించి ఉంటే యుక్త వయసు వచ్చే సంవత్సరాలను అంచనా వేసుకొని పెళ్లి చేయడం ఆనవాయితీగా వస్తోంది. నిజంగా చేసే పెళ్లి వేడుకకు ఏమాత్రం తీసిపోకుండా మరణించిన వారి పెళ్లి చేస్తుంటారు.
కాన్పు సమయంలో ఓ మగ శిశువు మరణిస్తే.. కాన్పు సమయంలోనే మరణించిన ఆడ శిశువుతో పెళ్లి చేస్తారు. ఇద్దరూ 20 ఏళ్లు దాటాక ఈ తంతు చేస్తారు. ఎంగేజ్ మెంట్ మొదలు.. పెళ్లి చేసి అప్పగింతులు, బరాత్ వరకూ ప్రతీ తంతును పెళ్లి చేసినట్టే సంప్రదాయబద్దంగా చేస్తారు.
ఈ వెరైటీ ప్రేతాత్మల పెళ్లి వేడుకను యూట్యూబర్ ఆనీ అరుణ్ వీడియోల రూపంలో ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ ఈ వింతపెళ్లిని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దక్షిణ కన్నడ జిల్లాలో గురువారం ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో మీకు వరుడు, వధువు కనిపించదు. వారు 30 ఏళ్ల క్రితమే మరణించారు. ఆ పెళ్లిలో వారు కూర్చోవాల్సిన ప్లేసులో ఖాళీ కుర్చీలు.. కొత్త బట్టలు పెట్టారు. ఈ వివాహ బందాన్ని ప్రేత కళ్యాణంగా పిలుస్తుంటారు.
And finally bride and groom take their place. Though they are dead, dont think that atmosphere will be like the funeral!! Its not. Its as jovial as any other marriage. Everyone cracking jokes and keep the mood high. Its a celebration of marriage. pic.twitter.com/MoUYIv2gnl
— AnnyArun (@anny_arun) July 28, 2022
చందప్ప-శోభలకు గురువారం జులై 28న దక్షిణ కన్నడలో పెద్దలు పెళ్లి జరిపించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కుటుంబాలు నిష్టగా పెళ్లి చేశారు. ఈ పెళ్లికి పిల్లలకు, పెళ్లికాని వారికి ఆహ్వానం ఉండదు. వారిని ఈ ప్రేతాత్మలు ఆవహిస్తాయన్న భయంతో రానివ్వరు.
Bride and groom do the 'Saptapadhi' 7 rounds before sit for the marriage. pic.twitter.com/IMnSEb4rio
— AnnyArun (@anny_arun) July 28, 2022
ఇక సంబంధం కూడా సరిగ్గా కాన్పులో మరణించిన అమ్మాయి, అబ్బాయిలనే ఎంపిక చేస్తారు. అబ్బాయి కంటే చిన్న అమ్మాయిలనే ఎంపిక చేసి చేస్తారు. అచ్చం పెళ్లి లాగానే చేసేఈ ప్రేతాత్మల వివాహం వైరల్ అవుతోంది.
I reached a bit late and missed the procession. Marriage function already started. First groom brings the 'Dhare Saree' which should be worn by the bride. They also give enough time for the bride to get dressed! pic.twitter.com/KqHuKhmqnj
— AnnyArun (@anny_arun) July 28, 2022