Homeఎంటర్టైన్మెంట్Singer Geetha Madhuri: మరోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి... సీమంతం వేడుక ఫోటోలు...

Singer Geetha Madhuri: మరోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతా మాధురి… సీమంతం వేడుక ఫోటోలు వైరల్

Singer Geetha Madhuri: సింగర్ గీతా మాధురి మరోసారి తల్లి కాబోతున్నారు. నిండు గర్భవతిగా ఉన్న గీతా మాధురి సీమంతం వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గీతా మాధురి టాలీవుడ్ స్టార్స్ సింగర్స్ లో ఒకరు. అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. గీతా మాధురి నటుడు నందు ని ప్రేమ వివాహం చేసుకున్నారు. తమ ప్రేమ విషయంలో పెద్దలకు చెప్పడంతో, ఇరు కుటుంబాల సభ్యులు ఒప్పుకున్నారు. 2014లో గీతా మాధురి-నందుల వివాహం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.

పెళ్ళైన ఐదేళ్లకు 2019లో గీతా మాధురి ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. పేరు దాక్షాయణి ప్రకృతి. కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ చైల్డ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం గీతా మాధురి గర్భవతి. ఈ క్రమంలో సీమంతం వేడుక నిర్వహించారు. పట్టుచీరలో గర్భవతిగా గీతా మాధురి చాలా అందంగా ఉన్నారు. భార్య సీమంతం వేళ భర్త నందు మురిసిపోయాడు. ఈ వేడుక ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా ఆ మధ్య గీతా మాధురి-నందు విడిపోతున్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. నిరాధార కథనాలను ఈ జంట తిప్పికొట్టారు. నందు నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరో కావాలని చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదు. ఈ క్రమంలో సపోర్టింగ్ రోల్స్, వెబ్ సిరీస్లలో కీలక పాత్రలు చేస్తున్నారు. నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ 2022లో విడుదలైంది. ఈ మూవీలో రష్మీ గౌతమ్ హీరోయిన్ గా నటించింది.

ఇక గీతా మాధురి బిగ్ బాస్ సీజన్ 2 పాల్గొన్న సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గీతా మాధురి ఫైనల్ కి వెళ్ళింది. ఫైనల్ లో నటుడు కౌశల్ తో ఆమె పోటీపడ్డారు. కౌశల్ ఆర్మీ పేరుతో భారీ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేసిన కౌశల్ విన్నర్ అయ్యాడు. గీతా మాధురి రన్నర్ గా నిలిచింది. ఈ మధ్య గీతా మాధురి హవా తగ్గింది. మంగ్లీ నుండి గీతా మాధురికి గట్టి పోటీ ఎదురవుతుంది.

Exit mobile version